Ysrcp 3rd List: ఏపీలో మరో అధికారం చేజిక్కించుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. 38 మందితో ఇప్పటికే రెండు జాబితాలు విడుదలయ్యాయి. ఇక మూడో జాబితా సిద్ధమైంది. ఇందులో మరిన్ని మార్పుుల చేర్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలుగుదేశం-జనసేన ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం అభ్యర్ధుల్ని ప్రకటిస్తున్నారు. వైనాట్ 175 లక్ష్యంగా గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తున్నారు. కొందరికి టికెట్ నిరాకరిస్తే మరి కొందరికి స్థాన చలనం కల్పిస్తున్నారు. ఇంకొందరిని ఎంపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే నుంచి ఎంపీకు మారుస్తున్నారు. తొలి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మందిని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను సిద్ధం చేసింది. మూడో జాబితాలో 25-30 మంది ఉండవచ్చని అంచనా. ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఇవాళ లేదా రేపు విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రాజమండ్రి ఎంపీగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ లేదా అలీ, విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ, విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి నుంచి అడారి రమాదేవి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గుంటూరు నుంచి అలీ పేర్లు విన్పిస్తన్నాయి. విజయవాడ నుంచి కేశినేని నాని ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కేశినాని నాని అసెంబ్లీకు వెళ్తారా లేక లోక్ సభకే వెళ్తారా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం పేరు విన్పిస్తోంది. కేశినేని నాని నిన్ననే వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం పార్టీ సభ్యత్వం, ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి, చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, ఆలూరు నుంచి విరూపాక్ష, నందికొట్కూరు నుంచి గంగాధర, మార్కాపురం నుంచి జంకె వెంకట్ రెడ్డి, పెందుర్తి నుంచి ఆదుర్తి రాజు, నెల్లూరు నుంచి కృపాలక్ష్మి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గూడూరు నుంచి మేరుగ మురళి, మడకశిర నుంచి శుభకుమార్ పేర్లు విన్పిస్తున్నాయి.
వైనాట్ 175 లక్ష్యంగా ముందుకు పోతున్న వైఎస్ జగన్ భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. దాదాపు 30-40 మందికి టికెట్ నిరాకరిస్తున్నారు. ఇక 30-40 స్థానాల్లో అభ్యర్ధుల్ని అటూ ఇటూ మారుస్తున్నారు. మరోవైపు అసంతృప్తుల్ని బుజ్జగించే పని చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు మూడో జాబితా విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
Also read: AP Voters Final List: జనవరి 22న ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల, మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ysrcp 3rd List: వైసీపీలో కలకలం, 30 మందితో సిద్ధమైన మూడో జాబితా, ఎవరున్నారంటే