Pawan Kalyan comments on YS Jagan: అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన ఆశయం ఓడిపోలేదు. ఉత్తరాంధ్ర నుండే తాను పోరాటం నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జనసేన జండా గాజువాకలో ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు.
Pawan Kalyan Visits Rushikonda: సీఎం జగన్‌కు ఎన్ని ఇళ్లు కావాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ ఇల్లు నిర్మిస్తాడా అని ముఖ్యమంత్రి జగన్‌ని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారు. మరి మిగిలిన ఆ ఒక్కరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, " జగన్‌కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది " అని ఆవేదన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Links Jagan With Telangana: ఏపీ సీఎం జగన్ పేరును తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదని పవన్ మండిపడ్డారు.
AP SSC Exams 2024: పదో తరగతి విద్యార్ధులకు ముఖ్య గమనిక ఇది. ఏపీలో పదవ తరగతి పరీక్లల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త మార్పుల ప్రకారం ఇక నుంచి పదవ తరగతి పరీక్షలు ఇలా ఉండనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.
Punganuru Violence Case: పలమనేరు డి.ఎస్పీ సుధాకర్ రెడ్డి ఇంచార్జ్, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా సబ్ అడిషనల్ ఎస్పీ కే లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రోడ్ షోను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను ప్రేరేపించాడని పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపాడని అన్నారు.
మృత్యువు ఏ రూపంలో ఎలా సంభవిస్తుందో తెలియదు. కొత్త కారు కొన్న మురిపంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జరిగింది. ఆ వివరాలు..
SP Rishnath Reddy Press meet About Punganuru Violence: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని ఎస్పీ హెచ్చరించారు.
YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
Bear Climbed on Tree: సిద్ధవటం ప్రధాన రహదారి గ్రామచావిడి వద్ద తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన ఎలుగు బంటి జన సంచారాన్ని చూసి చెట్టు ఎక్కి చిటారు కొమ్మలోకి వెళ్లి కూర్చుంది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి ఆధ్వర్యంలో ఎలుగుబంటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో తరలించడానికి ఏర్పాట్లు చేపట్టారు.
Volunteer Arrested in Forgery Case: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలనే దురుద్దేశంతో ఆయా పథకాలకు అవసరమైన ధృవపత్రాల స్థానంలో నకిలీ ధ్రవపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఉదంతం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.
Tomato Price: వారం రోజులగా సబ్సిడీ టమాటాలు రాకపోవడంతో విజయవాడ ప్రజలు అల్లాడిపోయారు. ఇవాళ మార్కెట్ కు అవి రావడంతో మార్కెట్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.
Niti Aayog Team meets AP CM YS Jagan: నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్‌లతో కూడిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.
Wild King Cobra Caught in Paddy Fields: వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన స్నేక్ క్యాచర్స్‌ని సైతం ఈ పాము భయంతో పరుగులు పెట్టేలా చేసింది.
Pawan Kalyan About Women Missing in AP: మన రాష్ట్రం నుంచి బాలికలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు ? వారికి ఏమి జరుగుతోంది ? వీరి అదృశ్యం వెనుక ఏం జరుగుతోంది, ఎవరు బాధ్యత తీసుకుంటారు ? అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి, ఏపీ మహిళా కమిషన్‌కి ప్రశ్నలు సంధించారు. రేపు ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా ? లేదా చూడాలి అని పవన్ కళ్యాణ్ సందేహం వ్యక్తంచేశారు.
Kinjarapu Rammohan Naidu News: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి కొరుకుడు పడని ఒకే ఒక ఏదైనా ఉందా అంటే అది అక్కడి లోక్ సభ సీటు అనే చెప్పుకోవచ్చు. పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి ఈ సీటు అందని ద్రాక్షే అయింది. మరి వచ్చే ఎన్నికల్లో అయినా సరే ఆ స్థానాన్ని తమ కైవసం చేసుకుని అక్కడ వైసీపీ జండా పాతాలని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ భావిస్తున్న నేపథ్యంలో శ్రీకాకులం రాజకీయాలపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.