Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో ఇద్దరు బడా తెలుగు నేతలు

Top 10 Richest MLAs In India:  దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారు. మరి మిగిలిన ఆ ఒక్కరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Pavan | Last Updated : Aug 11, 2023, 10:02 AM IST
Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో ఇద్దరు బడా తెలుగు నేతలు

Top 10 Richest MLAs In India: రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు తమకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను వెల్లడిస్తూ ఎన్నికల అధికారికి ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఆ అఫిడవిట్ ఆధారంగానే అతడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ రాజకీయ నాయకుల కుటుంబ నేపథ్యం ఏంటి ? వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా ? ఏవైనా కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారా ? అనే వివరాలు బహిర్గతం అవుతాయి. ఈ వివరాలను క్రోడకరించి మీడియా కథనాలు రాసుకుంటుంది. తాజాగా ఇండియా.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ముందున్నారు. కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత శివ కుమార్ సొంతం. శివ కుమార్ వద్ద రూ. 1413 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు గౌరిబిదనూరు ఎమ్మెల్యే కెహెచ్ పుట్టస్వామి గౌడ. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పుట్టస్వామి గౌడ వద్ద రూ. 1267 కోట్ల ఆస్తులు ఉన్నాయి.  

కర్ణాటక అసెంబ్లీలోని యువ ఎమ్మెల్యేల్లో ఒకరైన ప్రియ క్రిష్ణ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని గోవింద్రాజ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియ క్రిష్ణ తన వద్ద రూ. 1156 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకి 25 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా గెలిచి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈయన తండ్రి క్రిష్ణప్ప ఆ రాష్ట్ర మాజీ మంత్రి. 

నాలుగో స్థానంలో ఉన్నది మరేవరో కాదు.. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని 9 ఏళ్లు, కొత్తగా ఏర్పడిన ఏపీని ఐదేళ్ల పాటు పాలించి మొత్తం 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు వద్ద రూ. 668 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. 

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న మాన్స నియోజకవర్గం నుంచి బీజేపి టికెట్‌పై గెలిచిన జయంతి భాయి సోమభాయి పటేల్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. జేఎస్ పటేల్ వద్ద రూ. 661 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆయన ఎన్నికల అఫిడవిట్ చెబుతోంది.

హెబ్బల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సురేష బిఎస్ వద్ద రూ. 648 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఎమ్మెల్యేది ఆరో స్థానం. బిఎస్ సురేష్ కర్ణాటక కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.

ఇక ఇండియాలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల్లో ఏడవ స్థానంలో ఉన్నది మరెవరో కాదు.. మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే. ఔను.. ఏపీ సీఎం జగన్ రూ. 510 కోట్ల ఆస్తులతో దేశంలోనే టాప్ 10 ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచారు. 

మహారాష్ట్రలోని ఘట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి అక్కడి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపి నేత పరాగ్ షాది ఈ జాబితాలో 8వ స్థానం. పరాగ్ కిషోర్ చంద్ర షా వద్ద సరిగ్గా రూ. 500 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

త్రిభువన్ శరణ్ సింగ్ దేవ్.. ఈయన్నే టి.ఎస్. బాబా అని కూడా పిలుస్తుంటారు. ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం ఆ రాష్ట్ర కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. త్రిభువన్ శరణ్ సింగ్ దేవ్ వద్ద రూ. 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Rare Accident : గాల్లోకి ఎగిరి ఇంటి పై కప్పుని ఢీకొట్టిన కారు

మంగళ్ ప్రభాత్ లోధా.. ముంబైలోని మలాబార్ హిల్స్ నియోజకవర్గం నుండి బీజేపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మహారాష్ట్ర కేబినెట్లో మంత్రిగానూ ఉన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లోధా గ్రూప్ ఈయనదే. ఈయన ఆస్తి రూ. 441 కోట్లుగా ఎన్నికల నాటి అఫిడవిట్ చెబుతున్నప్పటికీ.. ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం లోధా మొత్తం నెట్‌వర్త్ అంతకంటే చాలా ఎక్కువేనని తెలుస్తోంది. వీళ్లంతా కూడా ఓ చేత్తో రాజకీయాలు, మరో చేత్తో వ్యాపారాలు మేనేజ్ చేస్తున్న వాళ్లే. అంటే పొలిటిషియన్స్ కమ్ బిజినెస్‌మేన్.. కొందరైతే... బిజినెస్‌మేన్ టర్న్ పొలిటిషియన్స్ కొందరన్నమాట.

ఇది కూడా చదవండి : Independence Day 2023 Long Weekend: అన్నీ మర్చిపోయి సరదాగా తిరిగొద్దాం రండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News