Murder Case With Illegal Affairs: అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జెర్రల పంచాయితీ కొండకించంగిలో ఈ నెల 24వ తారీఖున జరిగిన చిన్నారావు హత్య కేసుని ఛేదించిన పోలీసులు.. మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు.
న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
YS Vivekananda Reddy's Murder Case: రాజమండ్రి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Jagananna Vidya Deevena Scheme, Jagananna Vasathi Deevena Scheme: జనవరి - మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.703 కోట్లను మే 24న.. అంటే రేపే తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Telangana Weather Updates: సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు.
Temperature in AP: ఏపీలో పలు జిల్లాల్లో రేపు వర్షాలతోపాటు ఎండలు భారీగా ఉండనున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలతో కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..
AP Weather Updates: పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
AP Weather Report and Temperature : నేడు ఏపీలోని 29 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ మీడియాకు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు.
Anil Kumar Yadav About AP CM YS Jagan: పేరున్న గొర్రె కన్నా ఒంటరి సింహంగా ఉండటం మేలు అని వ్యాఖ్యానించిన అనిల్... ఒక సంవత్సరం పాటు తన గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగనన్నకు చెబుతా అని గుర్తుచేశారు. తనకు ఏదైనా బాధ కలిగితే కచ్చితంగా తనను బాధించిన విషయం గురించి సీఎం జగన్ కి చెప్పుకుంటా అని పేర్కొన్నారు.
మొన్నటి వరకి అకాల వర్షాల కారణంగా వేడి నుండి కొంత ఉపశమనం పొందినప్పటికీ.. వారం నుండి ఎండల కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
AP Govt starts E-Chits: అమరావతి, మే 15 : చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను వెలగపూడి ఆంద్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి సోమవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు.
MP YS Avinash Reddy: మాజీమంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలవడం ఇదేం మొదటిసారి కాదు అనే విషయం అందరికీ తెలిసిందే.
YSR Matsyakara Bharosa Scheme News: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ప్రతీ ఏడాది వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది.
AP Weather Updates: ఏపీలో రేపు మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
Chukkala Bhoomulu Rights in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Pawan Kalyan Press Meet: రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
గత కొద్దీ రోజులుగా అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి కానీ ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Cyclone Mocha live updates: ఈ అల్పపీడనం మోచా తూఫాన్‌గా మారుతున్న నేపథ్యంలో ఈ తుఫాన్ ఏ ప్రాంతంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే వివరాలను భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మోచా తుఫాన్‌పై వాతావరణ శాఖ నివేదక వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Manipur Violence News: అమరావతి: మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ విషయమై ఏర్పడిన ఘర్షణలు హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో శాంతి భద్రతల సమస్య తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.