Wild King Cobra Snake: పంట పొలాల్లో 13 అడుగుల కింగ్ కోబ్రా హల్​చల్​.. అటవీ శాఖ సిబ్బందిని పరిగెత్తించిన పాము

Wild King Cobra Caught in Paddy Fields: వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన స్నేక్ క్యాచర్స్‌ని సైతం ఈ పాము భయంతో పరుగులు పెట్టేలా చేసింది. 

Written by - Pavan | Last Updated : Jul 31, 2023, 11:52 AM IST
Wild King Cobra Snake: పంట పొలాల్లో 13 అడుగుల కింగ్ కోబ్రా హల్​చల్​.. అటవీ శాఖ సిబ్బందిని పరిగెత్తించిన పాము

Wild King Cobra Caught in Paddy Fields: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామ శివారులో ఉన్న పొలాల్లో ఓ భారీ కింగ్​ కోబ్రా స్నేక్ కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. ఇది ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాము కావడంతో అక్కడ పని చేసుకుంటున్న కూలీలు, జనాలు భయాందోళనకు గురయ్యారు. రైతులు, కూలీలు పనులన్నీ ఆపేసి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

విశాఖపట్నం నుంచి వన్యప్రాణి సంరక్షణ ప్రతినిధి మూర్తి బృందం కింగ్ కోబ్రా ఉన్న పొలానికి చేరుకున్నారు. గంట సేపు తీవ్రంగా శ్రమించి.. పాముకు ఎలాంటి హానీ తలపెట్టకుండా అతి కష్టం మీద సజీవంగా పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి  :Little Boy Playing With Snake: చిన్న పిల్లాడే కానీ పెద్ద పాముకి చుక్కలు చూపించాడు
చాలాసేపు శ్రమించి, ప్రాణాలకు తెగించి పట్టుకున్న పామును ఒక సంచిలో బంధించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి శివకుమార్ చెప్పారు. కింగ్ కోబ్రా పొడవు దాదాపుగా 13 అడుగులకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద నాగు పామును చూడడం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్పారు. పామును పట్టుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి :Cobra Enters Into Man's Shirt: చొక్కాలోకి చొరబడిన నాగు పాము.. పాపం అతడి పరిస్థేతేంటో మీరే చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News