Maharashtra assembly election Result 2024: మన దేశంలో ఉత్తర ప్రదేశ్ తర్వాత జనాభా పరంగా సీట్ల పరంగా అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అంతేకాదు మన దేశ ఆర్ధిక రాజధాని. మరి ఇక్కడ ప్రజలు ఎవరి పట్టం కట్టారనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గత ఎన్నికల్లో బీజేపీ,శివసేన ఓ కూటమిగా.. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ మరో కూటమిగా బరిలో దిగితే అక్కడి ప్రజలు బీజేపీ, శివసేన కూటమికి అధికార పీఠం కట్టబెట్టారు. కానీ శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పీఠం కోసం తన పార్టీ వ్యవస్థాపకుడు జీవిత కాల శత్రువుగా భావించిన కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి కట్టి మహా విఘాస్ అఘాడీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఉద్ధవ్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో ఓ వర్గం నేతలకు నచ్చలేదు. దీంతో ఏక్ నాథ్ శిండే నాయకత్వంలో పార్టీ నిలువునా చీలి.. బీజేపీ వైపు అడుగులు వేసి ఆ తర్వాత శిండే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్నారు. అటు ఎన్సీపీ చీలిక వర్గం శరత్ పవార్.. అన్న కుమారుడు అజిత్ పవార్ నేతృత్వంలో చీలి ఎన్డీయేలో చేరారు. అయితే.. గత లోక్ సభ ఎన్నికల్లో మహా యుతికి అక్కడ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం 48 సీట్లలో 17 సీట్లు మాత్రమే ఇచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీకి 31 సీట్లు కట్టబెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీయేకు గట్టి షాక్ ఇచ్చినా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారనేది ఆసక్తి కరంగా మారింది.
దేశానికి ఆర్ధిక వ్యవస్థకు ముంబై వెన్నుముక. అంతేకాదు హిందీ చిత్ర సీమను ఏలుతున్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ఇక్కడే కొలువై ఉంది. ఓ వైపు అత్యంత సంపన్నులు.. మరోవైపు కటిక పేదరికం ముంబై ను రెండు రకాలుగా విభజించవచ్చు. తాజాగా మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మరోసారి అధికారంలో వస్తానంటూ పలు సర్వేలు ఘోషిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ 149 సీట్లు..శివసేన (ఏక్ నాథ్ షిండే)..81 సీట్లు.. ఎన్సీపీ (అజిత్ పవార్) 59 సీట్లలో పోటీ చేసాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు అవసరం. మరి ఈ రెండు కూటముల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుందో చూడాలి. ఎంవీఏలో కాంగ్రెస్ . 101, శివసేన (ఉద్దవ్).. 95, ఎన్సీపీ (శరత్ పవార్) 86 సీట్లో పోటీ చేసారు. మొత్తంగా 288 స్థానాల్లో 4136 మంది బరిలో నిలిచారు. అందులో ఎవరి విజేతలుగా నిలుస్తారనేది మరికాసేట్లో తేలిపోనుంది. వీటితో ఎంఐఎమ్, ఎంఎన్ఎస్, బహుజన్ వంచిత్ అఘాడీతోపాటు మరాఠ్వాడకు చెందిన చిన్నా చితక పార్టీలు రంగంలోకి దిగనున్నాయి. మరోవైపు ఎన్నికల బరిలో నిలిచిన చిన్న పార్టీలు ఎవరి పుట్టి ముంచనున్నాయో చూడాలి. మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 26న ముగయనుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter