Tomato Price: రూ.50కే కిలో టమాటా.. క్యూలైన్లలో జనాల తంటా..

Tomato Price: వారం రోజులగా సబ్సిడీ టమాటాలు రాకపోవడంతో విజయవాడ ప్రజలు అల్లాడిపోయారు. ఇవాళ మార్కెట్ కు అవి రావడంతో మార్కెట్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 01:11 PM IST
Tomato Price: రూ.50కే కిలో టమాటా.. క్యూలైన్లలో జనాల తంటా..

Andhra Pradesh latest: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుని ఉన్నాయి. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టమాటా ధర ఆకాశాన్నింటిది. రెండు రోజుల కిందట మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా రూ.200 పలికింది. ప్రస్తుతం రూ.120 నుంచి రూ.200 మధ్య విక్రయిస్తున్నారు. ఈనేపథ్యంలో గత కొన్ని రోజులగా ఏపీ ప్రభుత్వం రైతు బజార్లు ద్వారా సబ్సిడీకే టమాటాలను అందిస్తుంది. కిలో టమాటా రూ. 50కే జనాలకు ఇస్తుంది. దీంతో తెల్లవారుజాము నుంచే జనాలు టమాటాలు కోసం బారులు తీరుతున్నారు. రైతు బజార్లలో ఒక్కొక్కరికి ఒక్కో కిలో మాత్రమే ఇస్తున్నారు. 

అయితే వారం రోజులుగా విజయవాడ వ్యాప్తంగా ప్రభుత్వం అందించే 50 రూపాయల సబ్సిడీ టమాటాలు రాకపోవటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ రైుతు బజార్లకు సబ్సిడీ టమాటాలు రావడంతో మార్కెట్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఉదయం ఆరు గంటలకే కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనం ఇచ్చాయి. నగరంలో ఉన్న అన్ని ప్రధాన రైతు మార్కెట్లో ఇదే మరి రద్దీ ఉంది. పనులన్నీ మానేసుకుని మరి ప్రజలు టమాటాల కోసం లైన్లలో నిల్చుంటున్నారు. తీరా కొన్నాక అవి నాసికరంగానూ, కుళ్లపోయినవి ఉంటున్నాయని వారు వాపోతున్నారు. 

Also Read: Srikalahasthi Shiva Temple: కళ్లు తెరిచిన శివ లింగం... వేల సంఖ్యలో గుడికి క్యూ కట్టిన భక్తులు

వారం రోజుల కిందట రైతు బజార్లలో కిలో టమాటా ధరలు 100 రూపాయిలు ఉండేవి. ఇప్పడు దాని ధర రూ.150కి పెరిగింది. మెున్నటి వరకు 120-130 మధ్య ఉన్న టమాటా రేటు నిన్న ఏకంగా రూ.20 పెరిగింది. రిటైల్ మార్కెట్లో అయితే ధరలు డబులు సెంచరీ దాటేశాయి. పెరిగిన ధరలు సామాన్యుడి అల్లాడిపోతున్నాడు. టమాటా రేట్లతోపాటు కూరగాయల ధరలు కూడా చుక్కులు చూపిస్తుండటంతో జనాలు కర్రీ చేసుకోవడం మానేశారు. 

Also Read: Polavaram Project: కష్ట సమయంలో ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News