Chandrababu Naidu Arrest Latest News: విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
Pawan Kalyan About Chandrababu Arrest And AP CM YS Jagan : అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..
Chandrababu Arrest: అర్ధరాత్రి దాదాపుగా ఆరేడు గంటల హైడ్రామా. ఎట్టకేలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏయే సెక్షన్ల ప్రకారం అరెస్టయ్యారో సీఐడీ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh Power Cuts News: రాష్ట్రంలో పవర్ కట్స్‌పై డిస్కంలు క్లారిటీ ఇచ్చాయి. గృహ, వ్యవసాయ రంగాలకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి. డిమాండు మరింత పెరిగితే పారిశ్రామిక రంగానికి స్వల్ప తగ్గింపు ఉంటుందని వెల్లడించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి.
YSR Rythu Bharosa Scheme Money Credited in Farmers Bank Accounts: ఆ భగవంతుడి దయతో ఈరోజు రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నామని... అందులో మొదటిది కౌలురైతులతో పాటు దేవాదాయభూములు సాగుచేసుకుంటున్న కౌలురైతులకు కూడా కలిపి.. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం అందిస్తున్నాం అని ఏపీ సీఎం జగన్ అన్నారు.
AP CM YS Jaganmohan Reddy Helps Kidney Patient: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. బుధవారం కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఝాన్సీ రాణి అనే యువతి కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.
Jagananna Vidya Deevena Scheme: ఉన్నత విద్యలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రకటించిన ఏపీ సర్కారు.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు కింద రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి సౌకర్యాలను అందిస్తున్నట్టు పేర్కొంది.
Payakaraopeta Politics: పాయకరావుపేట రాజకీయాల్లో టీడీపి తరపున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కానీ, మొదటి నుంచి ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం రాజీపడటం లేదు. ప్రజల్లోనూ టీడీపీకి సానుకూల వాతావరణం కనిపంచడం లేదు.
New TTD Board Members: టిటిడి చైర్మన్ గా ఇటీవలె భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టిటిడి బోర్డు సభ్యుల జాబితాలో 24 మంది సభ్యులకు చోటు లభించింది. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
Two Men Cheated People With Rs 1500 cr Debts: రూ. 100 కోట్ల వరకు అప్పు ఇచ్చిన విజయవాడలోని ఒక బార్ నిర్వాహకులు, అప్పు తీర్చాల్సిందిగా కొద్ది రోజుల నుంచి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలిసింది. రేపు మాపు అంటూ ఫోన్ కూడా ఎత్తకపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులతో కలిసి బార్ నిర్వాహకులు 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు.
తెల్లవారుజామున విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ ద్విచక్ర వాహనాల షోరూంలో మంటలు రావటంతో దాదాలు 300 బైక్ లు తగలబడ్డాయి. ప్రమాదానికి కారణం ఏంటని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎన్ని చట్టాలు తెచ్చిన.. ఎన్ని సవరణలు చేసిన.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయం అయితే మరీ దారుణంగా మారింది. పిల్లలని స్కూల్ కి పంపాలన్న భయపడాల్సిన పరిస్థితి. 13 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. దారుణంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం రేటు హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఒక రోజు 200 రూపాయలు తగ్గితే.. మరో రోజు 500 రూపాయల ధర పెరుగుతుంది. ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
Billionaires in Rajya Sabha: ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు వెల్లడించిన నివేదిక ప్రకారం రాజ్యసభలో ఏపీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న పదకొండు మంది రాజ్యసభ సభ్యులలో ఐదుగురు, అలాగే తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలలో ముగ్గురు శ్రీమంతులు ఉన్నారు.
Pawan Kalyan on Alliance With TDP and BJP: తాను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను ముఖ్యమంత్రిగా చెయ్యడానికైనా సంసిద్దంగానే ఉన్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా తనని ఎవరైనా తిడతాను అంటే పడతాను అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనను ఎవరేమన్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను అని అన్నారు.
దేశ సరిహద్దుల్లో పగలు, రాత్రి.. ఎండ, వాన, చలి.. తుఫాను అంటూ ఎలాంటి పరిస్థితులు అయినా లెక్కచేయకుండా దేశానికి కాపలా కాసే ఇండియన్ ఆర్మీ అంటేనే మన అందరికి ఒక గౌరవం.. ధైర్యం. రెండు దశాబ్దాలుగా ఒక గ్రామం తమ పిల్లలను ఆర్మీకి ఇస్తున్న గ్రామం రామాపురం. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.