తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ మైదానంలో చేపట్టిన ధర్మపోరాట సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం భగవంతుడి పేరు చెప్పి మరీ ఓట్లు దండుకొని.. ఆ తర్వాత తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా నెరవేర్చాల్సిన హామీలే నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నారై తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమైన ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విచ్చేశారు
చతుర్థ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలు, మంత్రులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలికి నివాళులు అర్పించారు.
భావికాలంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తే.. దానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తుందని.. ఏపీ రాజధాని అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం తథ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
అమరావతి ప్రాంతంలో తన ఇంటి శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు ముఖ్యమైన జనసేన నాయకులతో పాటు తన సతీమణితో విచ్చేసిన పవన్ కళ్యాణ్ అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.