మూడు రాజధానుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ సైతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒక్క రాజధాని చాలు అని అభిప్రాయపడ్డారు.
మూడు రాజధానుల అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. త్రీ కేపిటల్స్ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిణామాలన్నీ గందరగోళంగా తయారయ్యాయి. నిన్నటికినిన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది.
ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. శానస మండలిలో ఏపీ రాజధానుల బిల్లు వచ్చిన రోజే ఆయన రాజీనామా చేయడం టీడీపీకి ప్రతికూలాంశంగా మారనుంది.
దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా పది తాజా ముఖ్యాంశాలను ఒక్క చోట చేర్చి అందించే ప్రయత్నమే ఈ టాప్ 10 జాతీయ వార్తలు. దేశంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా.. జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
ఇటీవలే భారతీయ జనతా పార్టీతో చేయి కలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధానిలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుదీర్ఘ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో పల్లెల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహణపై స్పష్టత వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారమే (జనవరి 20న) ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మూర్ఖత్వం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని, రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని జగన్ ఒక్కడే నిర్ణయం తీసుకుంటే సరిపోదన్నారు.
రాష్ట్ర రాజధాని అంశం నిర్ణయించడానికి జనవరి 20న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తేలిపారు. హై పవర్ కమిటీ తన సమర్పించనున్న నివేదికపై జనవరి 20న భేటీలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన సభ కూడా అదే రోజు సమావేశమవుతుందని తెలిపారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల ప్రజల్లో తలెత్తిన అనుమానాలు, మూడు రాజధానుల నిర్ణయాలను జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ సవివరంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
గన్నవరం విమానాశ్రయం నుండి శనివారం ఢిల్లీ బయలుదేరిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ఇంకా కేంద్రంలోని నాయకులతో సమావేశమవడానికి ఇంకా అనుమతి రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి.
Dwarampudi Chandra Sekhara Reddy Sensational Comments | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రాజధానిని కాపాడుకోలేకపోతే పదవులు ఎందుకని.. దేశం విడిచి వేరే దేశానికి శరణార్థులుగా వెళ్లిపోవడం మంచిదని ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.
ఊరందరిది ఓ దారయితే ఉలిపికట్టది మరోదారి అన్నట్లుంది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరు. రాజధాని విషయంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని పవన్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అగ్గి రాజేస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములను త్యాగం చేసిన అన్నదాతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. దాదాపు 20 రోజుల కిందట మొదలు పెట్టిన అమరావతి ఉద్యమం క్రమక్రమంగా బలపడుతోంది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతుల పాదయాత్ర.
తూళ్లూరు గ్రామం నుంచి అమరావతి సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చిన రైతులు.
9 కిమీ మేర కొనసాగిన పాదయత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు, విద్యార్థులు.
పోలీసులు అనుమతి నిరాకరించినా... పాదయాత్ర చేసేందుకు వెనక్కి తగ్గని నిరసనకారులు.
20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే రైతులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరని నిరసనకారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతి రైతులు 19 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నా .. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. పైగా రాజధానుల ఏర్పాటుపై కమిటీలపై కమిటీలు వేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.