Russian attack on Kazan: రష్యాలో 9/11 లాంటి దాడి జరిగింది. కజాన్ నగరంలోని మూడు పెద్ద భవనాలపై ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనతో రష్యాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కజాన్ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. డ్రోన్ భవనాలను ఢీకొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ యుద్దానికి ముగింపు పలుకుతానని శపథం చేసాడు. కానీ ఆయన పదవి చేపట్టేలోపే.. జో బైడెన్ ప్రభుత్వం.. ఉక్రెయిన్ ను రష్యాను రెచ్చగొట్టేలా వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా పై మిస్సైల్స్ దాడులు చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా కూడా అదును చూసి ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.
Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
Russia and Ukraine అంతర్జాతీయ స్థాయి సమావేశం అయిన బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ లో జండా విషయంలో రష్యా మరియు ఉక్రెయిన్ ప్రతినిధుల గొడవకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Helicopter Almost Touches Cars on Road: హైవేపై రయ్యుమని దూసుకెళ్తుండగా ఉన్నట్టుండి మీరు డ్రైవ్ చేస్తున్న కారు మీదకే ఆర్మీ హెలీక్యాప్టర్ దూసుకొస్తే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ? అది కూడా దాదాపు కారును ఢీకొంటుందా అన్నంత దగ్గరగా వస్తే ఆ సమయంలో మీ గుండె ఆగినంత పనవుతుంది కదా.
Russia Ukraine citizenship: ఉక్రెయిన్ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే ఉత్తర్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. దీంతో ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింతగా పెరగనుంది.ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజిజియా, ఖేర్సన్ ప్రాంతాల వారికే రష్యా పౌరసత్వం ఈజీగా లభించేది.పుతిన్ తాజా నిర్ణయంతో అన్ని ప్రాంతాలకు వారికి ఈ అవకాశం దక్కనుంది.
Russia Ukraine War: మారియుపోల్ నగరంలో సుమారు 83 రోజుల పాటు రష్యా సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మారియుపోల్ రక్షణలో నిమగ్నమైన ఉక్రేనియన్ సైనికులు మంగళవారం రేషన్లు, ఆయుధాలు మరియు మందులు అయిపోయిన తర్వాత లొంగిపోయారు.
Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచమంతా భయపెట్టిస్తున్నపేరు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో చర్చనీయాంశమైన వ్యక్తి. ఇప్పుడు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారా..సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి.
Wheat Prices Hiked: గోధుమల ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కిలో గోధుమల ధర సగటున రూ. 32.38 కి పెరిగింది. 2010 జనవరి తర్వాత గోధుమల ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంటే గత పన్నెండేళ్లలో గోధుమ ధరలు ఇంత గరిష్ట స్థాయికి చేరడం ఇదే ప్రప్రథమం అన్నమాట.
Russia Claims Lsrael Supports: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో పాటు మాటల మంటలు కొనసాగుతున్నాయి. యుద్ధంలో ఇరుదేశాల సైన్యాలు పోటాపోటిగా యుద్ధం చేస్తున్నాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఇరు దేశాల యుద్ధంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.
Todays Gold Rate: బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దికాలంగా అమాంతంగా పెరిగిన బంగారం ధర..రెండ్రోజుల్నించి తగ్గుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా...
Nuclear Attack: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చరమాంతానికి చేరనుందా..రోజురోజుకూ విషమంగా మారుతున్న పరిస్థితి అణుదాడితోనే అంతం కానుందా. బ్రిటన్ నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి.
LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓపై మరో కొత్త అప్డేట్ వచ్చింది. మే తొలినాళ్లలో ఎల్ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. 5 శాతంకన్నా ఎక్కువ వాటాను ఐపీఓలో విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొద్దిరోజుల క్రితం ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధానికి లేఖ రాసిన సీఎం... తాజాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు.
India on Joe Biden: ఉక్రెయిన్ విషయంలో ఇండియా స్థిరంగా లేదనే అమెరికా ఆరోపణలకు ఇండియా స్పందించింది. ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా..దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.
Nuclear War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదిరేకొద్దీ ప్రపంచ దేశాలకు కొత్త భయం చుట్టుకుంటోంది. అగ్రరాజ్యాల దృష్టి అణ్వాయుధాలపై పడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆ కారణాలేంటో పరిశీలిద్దాం..
ATF price hike: విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు స్థాయిలో పెరిగింది. బుధవారం పెంచిన రేట్లతో తొలిసారి కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.లక్ష దాటింది. ముడి చమురు ధరలు భారీగా పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Russian Model Murdered: ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్న క్రమంలో ఓ రష్యన్ మోడల్ మృతదేహం అక్కడ లభించింది. గ్రేటా వెడ్లర్ అనే రష్యా మోడల్ మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కనుగొన్నారు. అయితే ఈమె గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విమర్శలు చేయడమే ఆమె మృతికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Volodymyr Zelensky: రష్యాకు బయపడి దేశం విడిచి పారిపోయాడని, బంకర్లో దాక్కున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్స్కీ. ఈ మేరకు తాను ఎక్కడ ఉంటున్నానో చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.