Nuclear Attack: ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా అణుదాడి తధ్యం, బ్రిటన్ హెచ్చరిక

Nuclear Attack: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చరమాంతానికి చేరనుందా..రోజురోజుకూ విషమంగా మారుతున్న పరిస్థితి అణుదాడితోనే అంతం కానుందా. బ్రిటన్ నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2022, 09:07 AM IST
  • యుద్దం ప్రారంభమై రెండు నెలల కావస్తున్నా తేలని ఫలితం
  • మరియాపోల్ నగరం రష్యా హస్తగతం
  • అణుదాడితో ఇతర ప్రాంతాల్ని కైవసం చేసుకోనుందంటూ బ్రిటన్ నిఘా వర్గాల హెచ్చరిక
Nuclear Attack: ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా అణుదాడి తధ్యం, బ్రిటన్ హెచ్చరిక

Nuclear Attack: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చరమాంతానికి చేరనుందా..రోజురోజుకూ విషమంగా మారుతున్న పరిస్థితి అణుదాడితోనే అంతం కానుందా. బ్రిటన్ నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఎటుచూసినా ఎక్కడ చూసినా పెద్దఎత్తున మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. రష్యా దాడులకు అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో అంతా శిధిలమై కన్పిస్తోంది. ఎన్నెన్ని శిధిలాల కింద ఎంతమంది నలిగిపోయోరో తెలియని దుస్థితి. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందనేది ప్రపంచదేశాల్ని కలవరపెడుతోంది. ఉక్రెయిన్ నగరాల్ని రష్యా సైన్యం చుట్టుముడుతోంది. 

ఈ క్రమంలో ఈ యుద్ధం చరమాంకానికి చేరుకునే ప్రమాదముందనేది నిఘా వర్గాల తాజా హెచ్చరిక. అంటే అణుదాడితోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియవచ్చనేది బ్రిటన్ నిఘా వర్గాల సమాచారం. ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి చేయడం ఖాయమని బ్రిటన్ ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. రష్యా సైనికులు ఎంతగా ప్రయత్నించినా ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఓ వైపు రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా సయోధ్య కుదిరే పరిస్థితులు కన్పించడం లేదు. ఇప్పటికే రష్యా..ఉక్రెయిన్‌లోని మరియాపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇతర ప్రాంతాల్ని కైవసం చేసుకునేలా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయనుందని బ్రిటన్ దేశం హెచ్చరిస్తోంది. ఏ క్షణమైనా ఎప్పుడైనా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశాలున్నాయని బ్రిటన్ పదే పదే స్పష్టం చేస్తోంది. 

Also read: Rare Incident: హస్త ప్రయోగం ఎఫెక్ట్... ఊపిరితిత్తులు దెబ్బతిని ఆసుపత్రిలో చేరిన యువకుడు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News