India on Joe Biden: ఇండియా ఏం చేసినా దేశ ప్రయోజనాల దృష్టిలోనే

India on Joe Biden: ఉక్రెయిన్ విషయంలో ఇండియా స్థిరంగా లేదనే అమెరికా ఆరోపణలకు ఇండియా స్పందించింది. ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా..దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2022, 03:35 PM IST
India on Joe Biden: ఇండియా ఏం చేసినా దేశ ప్రయోజనాల దృష్టిలోనే

India on Joe Biden: ఉక్రెయిన్ విషయంలో ఇండియా స్థిరంగా లేదనే అమెరికా ఆరోపణలకు ఇండియా స్పందించింది. ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా..దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలు యుద్ధం కారణంగా నష్టపోతున్నా..ప్రపంచదేశాలపై కూడా యుద్ధం ప్రభావం పడుతోంది. ఈ యుద్ధానికి సంబంధించి అమెరికా సహా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను సమర్ధిస్తున్నాయి. ఇండియా మాత్రం ఏ దేశాన్ని సమర్ధించడం లేదు. మరోవైపు యుద్ధం ఆపాల్సిందిగా ఇండియా విజ్ఞప్తి కూడా చేసింది. ఉక్రెయిన్‌కు సహాయం అందించింది. 

ఈ నేపధ్యంలో ఇండియా..ఉక్రెయిన్ విషయంలో స్థిరంగా లేదనే ఆరోపణలు వచ్చాయి. అటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఇండియా అస్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు. జో బిడెన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఇండియా సమాధానమిచ్చింది. విదేశాంగ మంత్రి జయశంకర్ పార్లమెంట్‌లో ఈ విషయంపై మాట్లాడారు. భారత దేశ విదేశాంగ నీతి..దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఉంటుందన్నారు. అటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌లో నెలకొన్న మానవ సంక్షోభంపై చేసిన తీర్మానానికి ఇండియా సహా 13 సభ్యదేశాలు ఓటు వేయలేదు. రష్యా చేసిన ప్రతిపాదనకు దూరంగా ఉండటం ద్వారా ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో ఇండియా తన వైఖరిని స్పష్టం చేసింది. రష్యా తరపున ఓటేయకపోవడంతో..భద్రతామండలి తీర్మానం ఆమోదం కాలేదు. 

Also read: Tiger Team: రష్యా అణుదాడికి దిగితే..అమెరికా ఏం చేస్తుంది, టైగర్ టీమ్ పనేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News