Chopper Flying on Road: వాహనాలపైకి దూసుకొచ్చిన హెలీక్యాప్టర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వైరల్ వీడియో

Helicopter Almost Touches Cars on Road: హైవేపై రయ్యుమని దూసుకెళ్తుండగా ఉన్నట్టుండి మీరు డ్రైవ్ చేస్తున్న కారు మీదకే ఆర్మీ హెలీక్యాప్టర్ దూసుకొస్తే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ? అది కూడా దాదాపు కారును ఢీకొంటుందా అన్నంత దగ్గరగా వస్తే ఆ సమయంలో మీ గుండె ఆగినంత పనవుతుంది కదా. 

Written by - Pavan | Last Updated : Oct 23, 2022, 02:08 PM IST
  • హైవేపై వెళ్తున్న వాహనదారులకు షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్
  • ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్న వైరల్ వీడియో
  • వెల్ కమ్ టు ఉక్రెయిన్ వైరల్ వీడియోకు భారీ స్పందన
Chopper Flying on Road: వాహనాలపైకి దూసుకొచ్చిన హెలీక్యాప్టర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వైరల్ వీడియో

Helicopter Almost Touches Cars on Road: రోడ్లపైకి హెలీక్యాప్టర్లు, యుద్ధ విమానాలు దూసుకొచ్చే దృశ్యాలన్నీ యాక్షన్ సినిమాల్లోనే కనిపిస్తాయి కానీ రియల్ లైఫ్‌లో అసాధ్యం అని అనుకుంటున్నారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు మేము మీకు చూపించబోయే ఈ వైరల్ రియల్ టెర్రిఫిక్ వీడియో చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం పక్కా. పైగా ఇది సినిమా కాదు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న రియల్ వీడియో. 

ఉక్రెయిన్‌లో ఒక హైవేపై వెళ్తున్న వాహనదారులకు ఉన్నట్టుండి ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది. అసలే రష్యా బలగాలతో అనునిత్యం తలపడుతూ, బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్న దిక్కుతోచని దుస్థితిలో ఉక్రెయిన్ వాసులు ఉన్నారు. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఏ మిస్సైల్ తమ వైపు దూసుకొస్తుందో లేక ఏ బాంబు వచ్చి మీద పడుతుందో అనే భయంతో ప్రతీక్షణం గుండెను గుప్పిట్లో పట్టుకుని బతుకుతున్నారు. అలాంటి భయాందోళనల మధ్య భయం భయంగా బతుకు వెళ్లదీస్తున్న ప్రస్తుత తరుణంలో ఏదైనా ఒక ఆర్మీ హెలీక్యాప్టర్ మీదమీదకు దూసుకొస్తుంటే వాళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇంకా సస్పెన్స్ లో పెట్టడం ఎందుకు కానీ ఆ టెర్రిఫిక్ సీన్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి.

 

ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది మరెవరో కాదు.. ఉక్రెయిన్ ఢిపెన్స్ విభాగమే తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది. వెల్‌కమ్ టూ ఉక్రెయిన్ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక్కడ గ్రహించాల్సిన విషయం మరొకటుంది. వెల్ కమ్ టు ఉక్రెయిన్ అనే చిన్న క్యాప్షన్‌తోనే ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం గురించి చెప్పకనే చెప్పేసింది. 

రోడ్లపై, జనావాసాలపై చక్కర్లు కొడుతున్న ఆర్మీ హెలీక్యాప్టర్లు, యుద్ధ విమానాల మోతతో ఉక్రెయిన్ వీధులు, రహదారులు మార్మోగిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి వాతావరణమే దర్శనం ఇస్తుందన్నమాట. అందుకే సింపుల్‌గా 'వెల్ కమ్ టు ఉక్రెయిన్' అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టిందన్నమాట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో (Viral Video ) చూసిన నెటిజెన్స్ కూడా తమ రియాక్షన్స్‌ని రిప్లైల రూపంలో కామెంట్ చేస్తున్నారు.

Also Read : Bhangra at London Airport: లండన్ ఎయిర్ పోర్టులో ఇండియన్ 'బల్లే బల్లే'.. వైరల్ వీడియో

Also Read : Snake Viral Video: ఫుల్ ట్రాఫిక్..రోడ్డు మధ్యలో భయంకరమైన పాము, తరువాత ఏం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News