Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ కేన్సర్..ఎంతవరకూ నిజం

Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచమంతా భయపెట్టిస్తున్నపేరు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో చర్చనీయాంశమైన వ్యక్తి. ఇప్పుడు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారా..సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 16, 2022, 09:15 AM IST
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై కలవరం కల్గిస్తున్న వార్తలు
  • బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారని వెల్లడించిన బ్రిటన్ దేశపు మాజీ గూఢఛారి క్రిస్టోఫర్
  • కేన్సర్ చికిత్సలో భాగంగానే ఇటీవల పుతిన్‌కు స్పైనల్ సర్జరీ
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ కేన్సర్..ఎంతవరకూ నిజం

Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచమంతా భయపెట్టిస్తున్నపేరు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో చర్చనీయాంశమైన వ్యక్తి. ఇప్పుడు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారా..సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి.

ఇండియాకు దశాబ్దాలుగా స్నేహదేశంగా ఉన్న రష్యా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల విమర్శలు అందుకుంటోంది. కారణం ఆ దేశపు పొరుగుదేశం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడమే. దాదాపు మూడు నెలల్నించి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యుద్దం నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చనీయాంశంగా మారారు. నిన్నటి వరకూ యుద్ధం కారణంగా చర్చనీయాంశమైతే..ఇప్పుడతని గురించి మరో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారని బ్రిటీష్ మాజీ స్పై క్రిస్టోఫర్ స్టీల్ చెబుతున్నారు. బ్లడ్ కేన్సర్ కారణంగా వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని అంటున్నారు. యూఎస్ కు చెందిన ఓ మేగజీన్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని క్రిస్టోఫర్ వెల్లడించారు. వ్లాదిమిర్ ఆరోగ్యం కుదుటపడుతుందా లేదా తెలియదు కానీ, పరిస్థితి మాత్రం విషమమే అని చెప్పవచ్చంటున్నారు. రష్యా, ఇతర ప్రాంతాల్నించి కూడా ఇదే సమాచారం అందుతోందని మాజీ గూఢచారి చెబుతున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్‌పై యుద్దానికి ముందు నుంచే వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగాలేదని తెలుస్తోంది. కేన్సర్ చికిత్సలో భాగంగా వెన్నుకు శస్త్రచికిత్స జరిగింది. 

ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని క్రిస్టోఫర్ చెబుతున్న మాటల్ని ఇంకా రష్యా ప్రభుత్వ అధికారులెవరూ ధృవీకరించలేదు.

Also read: Newyork Shooting: జాతి విద్వేష కాల్పులు... అమెరికాలో అగంతకుడి కాల్పుల్లో 10 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News