Covid Super Strain: ప్రపంచాన్ని ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. మరోవైపు సూపర్ స్ట్రెయిన్ ముప్పు ఇండియాను వెంటాడుతోంది. ఇదే కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Omicron Variant: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఊహించినట్టుగానే భయపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
12 omicron positive new cases in telangana : తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 20కి చేరింది. కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ ఒక ప్రకటన చేసింది.
Karnataka: కర్ణాటకలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని రెండు క్లస్టర్లలోని రెండు విద్యాసంస్థల్లో ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
18 students test covid 19 positive in Mumbai: ఆ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి ఒకరు ఇటీవల ఖతార్ నుంచి ముంబై వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనికి కోవిడ్ నెగటివ్‌గా తేలినప్పటికీ... అతని కొడుక్కి మాత్రం పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
Omicron cases in India: ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.
Lockdown in some states soon : దేశం మొత్తం లేదా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో లాక్డౌన్ విధిస్తారంటూ ప్రచారం సాగుతోంది. పబ్లిక్ ప్లేస్‌లలో కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో ఇప్పటికే ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్‌లో తొలి కంటైన్మెంట్ జోన్ కూడా ఏర్పాటైంది.
Telangana new Omicron Cases : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు చేరింది. మరో మూడు కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది.
Scientist warns about Omicron : ఒమిక్రాన్ పెద్ద ప్రభావం చూపించదని.. ఏదో చిన్నపాటి వ్యాధుల బారిన పడుతామని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి ప్రముఖ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి ఏమంటున్నారో ఓ సారి చూద్దాం..
భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో థర్డ్ వేవ్ తప్పదు అని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ సిద్దం చేసుకోవాలి సూచించారు.
Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్య మరోసారి 8 వేల దిగువన నమోదైంది. యాక్టివ్ కేసులు 90 వేల దిగువకు తగ్గాయి.
Omicron Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి వెలుగుచూస్తున్న అంశాలు భయపెడుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే అత్యధిక వేగంతో సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు ఎంత ఉందంటే..
Covid-19 vaccines effect on Omicron : ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్19 వ్యాక్సిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని కొత్తగా ఒక పరిశోధనలో వెల్లడైంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం.. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిపై కూడా ఎక్కువగా ఉంటుందని తేలింది.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియెంట్ ఒమిక్రాన్.. తెలంగాణలోకి కూడా ప్రవేశించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడేళ్ల చిన్నారికి కూడా పాజిటివ్ అని తేలింది.
Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 6,984 మందికి కరోనా సోకింది. మరో 247 మంది కొవిడ్ ధాటికి బలయ్యారు. ఒక్కరోజే 8,168 మంది వైరస్ నుంచి విముక్తి పొందారు.
Omicron in Noida: దేశంలో వరుస ఒమిక్రాన్ కేసులు (omicron cases in india) ప్రజల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. నోయిడాలో కొత్త మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అవ్వడం వల్ల ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. వీరంతా యునైటెడ్ నేషన్, సింగపూర్ దేశాల నుంచి వచ్చిన వారు కొత్త వేరియంట్ బారిన (Omicron in Noida) పడినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Pfizer Medicine on Omicron: ఒమిక్రాన్ ప్రపంచమంతా విస్తరిస్తూ ఆందోళన రేపుతున్న తరుణంలో ఫైజర్ కంపెనీ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. కోవిడ్ చికిత్సకై తయారు చేసిన ఆ మందు ఒమిక్రాన్‌పై సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.