Omicron : ఒమిక్రాన్‌తో చాలా ప్రమాదం.. మొత్తం ఆరోగ్య వ్యవస్థే నాశనం.. శాస్త్రవేత్తల వార్నింగ్

Scientist warns about Omicron : ఒమిక్రాన్ పెద్ద ప్రభావం చూపించదని.. ఏదో చిన్నపాటి వ్యాధుల బారిన పడుతామని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి ప్రముఖ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 03:47 PM IST
  • ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తోన్న ఒమిక్రాన్
  • ఒమిక్రాన్ స్ట్రెయిన్ తేలికైనది కాదు..
  • దీన్ని లైట్‌గా తీస్కోవద్దు
  • ఈ వేరియంట్ మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది..
  • హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
Omicron : ఒమిక్రాన్‌తో చాలా ప్రమాదం.. మొత్తం ఆరోగ్య వ్యవస్థే నాశనం.. శాస్త్రవేత్తల వార్నింగ్

Top Scientist warns against thinking Omicron strain causes mild disease and explain Omicron variant features: ప్రపంచం మొత్తాన్ని ప్రస్తుతం ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. అయితే కొందరు మాత్రం ఇదేమీ పెద్ద ప్రభావం చూపించదని.. ఏదో చిన్నపాటి వ్యాధుల బారిన పడుతామని కొట్టిపారేస్తున్నారు. మరి ప్రముఖ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.. 

ఒమిక్రాన్ (Omicron) స్ట్రెయిన్ అంత తేలికైనది కాదని భారతీయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీన్ని లైట్‌గా తీస్కోవద్దు అంటూ సూచిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ( Institute of Genomics and Integrative Biology) (IGIB) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ ( Dr Anurag Agrawal) ఒమిక్రాన్ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ సాధరణమైనదే.. దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. 

ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ వేరియంట్ మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. ఒమిక్రాన్ ప్రారంభ దశ అంత తేలికైనదేమీ కాదని ఆయన హెచ్చరించారు.ఈ కొత్త వేరియంట్ గురించి డిసెంబర్ (December) చివరి నాటికి కాస్త లోతుగా తెలుసుకోగలమని డాక్టర్ అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్ వల్ల మనదేశానికి పెద్ద ముప్పు ఏర్పడకూడదని ఆశిద్దాం అని చెప్పారు. కానీ ఈ వేరియంట్‌ వల్ల ఏర్పడే ముప్పునకు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. 

ఒమిక్రాన్ విషయంలో దక్షిణాఫ్రికాతో (South Africa) పోల్చుకుంటే భారత్ కు (India) పెద్ద ప్రమాదం లేదని పోల్చుకోవడం సరైనది కాదని నిర్ధారించారు. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (Council of Scientific and Industrial Research) (CSIR) ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ( Institute of Genomics and Integrative Biology) (IGIB) ఒమిక్రాన్‌ వేరియంట్ తీవ్రతను, ఉద్ధృతిని గుర్తించడానికి పరిశోధనలను చేపడుతోంది.

Also Read : ఈ ఫోటోలో ఏముందో కనిపెట్టడానికి మీకు ఎంత టైమ్ పట్టింది?

ఇప్పటివరకు 77 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (WHO Director-General Dr Tedros Adhanom Ghebreyesus) మాట్లాడుతూ.. ఒమిక్రాన్ (Omicron) ఇంతకు ముందు వేరియంట్‌లకంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. చాలా మంది ఒమిక్రాన్ తేలికపాటి వేరియంట్ అని అంటున్నారని, కానీ ఇది ప్రమాదకరమైన వేరియంట్‌ అని పేర్కొన్నారు. 

ఒకవేళ ఒమిక్రాన్ (Omicron) తక్కువ తీవ్రమైన వేరియంట్ అయినా కూడా దాని వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందన్నారు. దీంతో మళ్లీ ఆరోగ్య వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : Omicron: భారత్ ప్రమాదంలో ఉంది.. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News