Pfizer Covid-19 pills: న్యూయార్క్: కొవిడ్-19 పిల్‌పై తమ పరిశోధనల తాజా ఫలితాలను ఫైజర్ వెల్లడించింది. కరోనావైరస్ సోకిన వారు ఆస్పత్రిపాలవకుండా నిరోధించేందుకు కొవిడ్-19 మాత్రలు ఉపయోగపడుతున్నట్టు స్పష్టంచేసిన ఫైజర్.. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్న వారిలో మరణాల సంఖ్యను తగ్గిండంలోనూ ఫైజర్ కొవిడ్ పిల్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు ఫైజర్ పార్మాసుటికల్స్ (Pfizer) తేల్చిచెప్పింది.
Omicron in Surat: దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా గుజరాత్ లోని సూరత్ లో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ టూరిస్టు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది.
Kareena Kapoor and Amrita Arora test Covid 19 positive: బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా కరోనా బారినపడ్డారు. ఈ ఇద్దరు కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించినట్లు బృహత్ ముంబై కార్పోరేషన్ వెల్లడించింది.
World Omicron Alert: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది. ఒమిక్రాన్ సంక్రమణ దేశాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ సంక్రమణ ఇలా ఉంది.
Aarogyasri app: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులో రానుంది.
AP Omicron Update: కరోనా మహమ్మారి కొత్తరూపం ఒమిక్రాన్ వేరియంట్‌పై ఏపీ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ సోకిన తొలివ్యక్తి చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఒమిక్రాన్ నెగెటివ్‌గా పరీక్షలో తేలింది.
Omicron case in Kerala: తిరువనంతపురం: కేరళలో ఆదివారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యునైటెడ్ కింగ్డమ్ నుంచి కొచ్చికి వచ్చిన వ్యక్తికి ఈ కొత్త రకం వేరియంట్ సోకినట్టు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.
Omicron in Bangladesh: బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం వారిద్దరిని క్వారంటైన్ కు తరలించినట్లు బోర్డు అధికారులు తెలిపారు.
Omicron scar: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరింత పెరుగుతున్నాయి. కర్ణాటకలో మరో వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
Covid19 Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అంచనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ నేపధ్యంలో భయాందోళనలు రేగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే.
First Omicron Case in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ కేసు (Omicron Case in AP) బయటపడింది. ఇటీవలే ఐర్లాండ్ నుంచి వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో పాజిటివ్ గా తేలింది. అతడి శాంపిల్స్ ను హైదరాబాద్ పంపించగా.. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు (Andhra Pradesh Corona Cases) స్పష్టమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని అధికారులు అప్రమత్తమయ్యారు.
omicron created a furore corona cases : బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. బ్రిటన్‌లో కేసులు మరింత పెరగనున్నాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. పరిస్థితులు గత రెండు వారాల మాదిరిగానే ఉంటే.. రాబోయే రెండు లేదా నాలుగు వారాల్లో 50% కరోనా కేసులు ఓమిక్రాన్ కారణంగానే వస్తాయని పేర్కొంది.
Two Bangladesh Women’s Cricketers Test Positive For Omicron : బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో ఇద్దరు క్రికెటర్స్ ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇటీవల జింబాబ్వే పర్యటన నుంచి తిరిగొచ్చిన వారిద్దరూ ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వైద్యశాఖ మంత్రి జహీద్ మలాకీ ప్రకటన చేశారు.
Centre monitoring 27 districts with spike in Covid positivity rate : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చిరించింది. కేరళ, సిక్కిం, మిజోరంలలోని ఎనిమిది జిల్లాలలో కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రెండో కేసు నమోదైంది. జింబాంబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దాంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 30 దాటింది.
One more Omicron case : ముంబైలోని ధారవి ప్రాంతంలో కొత్తగా ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఆ వ్యక్తి తాజాగా.. టాంజానియా నుంచి ముంబైకి తిరిగి వచ్చాడని తేలింది. బాధితుడు స్థానికల సెవెన్‌హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.