Mcap lose: స్టాక్ మార్కెట్లు గత వారం నమోదు చేసిన నష్టాలతో దిగ్గజ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనితో బీఎస్ఈలోని టాప్-10 కంపెనీల్లో 9 సంస్థలు రూ.2.62 లక్షల కోట్ల ఎం-క్యాప్ కోల్పోయాయి.
Omicron strain: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త రకం కరోనా వేరియంట్ భయాలతో ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
WHO’s Dr Soumya Swaminathan Warns Against Omicron : ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు. ముఖ్యంగా మాస్కులు ధరించాలని చెప్పారు. మాస్కులనేవి జేబులో ఉండే వ్యాక్సిన్లలాంటివని ఆమె చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ICC ODI World Cup Qualifiers: సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృభింస్తున్న వేళ.. మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పోటీలను రద్దు చేశారు. ఇదే విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటన చేసింది. ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉన్న జట్లను ప్రపంచకప్ ఆడేందుకు అర్హత సాధించనట్లు తెలుస్తోంది.
South Africa Corona Variant: సౌతాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై పలు దేశాలు నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ కు వచ్చిన ఓ విమానంలో 60కి పైగా కరోనా కేసులు నిర్ధరణ అవ్వడం డచ్ అధికారులను కలవర పెడుతోంది.
Covid 19 new variant Omicron: కోవిడ్ 19 కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ 'ఒమిక్రాన్'గా నామకరణం చేసింది. ఆందోళనకర వేరియంట్‌గా దీన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ... దీనిపై మరింత విస్తృత పరిశోధనలు అవసరమని పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.