Covid Super Strain: ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, సూపర్ స్ట్రెయిన్‌పై పెరుగుతున్న ఆందోళన

Covid Super Strain: ప్రపంచాన్ని ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. మరోవైపు సూపర్ స్ట్రెయిన్ ముప్పు ఇండియాను వెంటాడుతోంది. ఇదే కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2021, 10:51 AM IST
Covid Super Strain: ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, సూపర్ స్ట్రెయిన్‌పై పెరుగుతున్న ఆందోళన

Covid Super Strain: ప్రపంచాన్ని ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. మరోవైపు సూపర్ స్ట్రెయిన్ ముప్పు ఇండియాను వెంటాడుతోంది. ఇదే కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో కరోనా కల్లోలం ఆగకముందే..దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తూ ఆందోళన రేపుతోంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 128కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ చాలా దేశాల్లో ప్రమాదకరంగా మారింది. యూకేలో అయితే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపధ్యంలో ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)2022 జనవరి నాటికి ప్రారంభం కావచ్చనేది నిపుణుల హెచ్చరిక. ఒమిక్రాన్‌కు తోడుగా సూపర్ స్ట్రెయిన్ ప్రమాదం పొంచి ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. 

ఇప్పటికే వేరియంట్ ప్రపంచంలోని చాలా దేశాల్లో విస్తరించింది. యూకే, దక్షిణాఫ్రికాలో అతి వేగంగా సంక్రమిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్(Omicron Variant) భయంతో ఆందోళన చెందుతున్న ప్రజలకు మరో వార్త భయపెట్టనుంది. త్వరలో ఇండియాను మరో కరోనా వేవ్ తాకనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి నాటికి రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరిక జారీ అయింది. కొత్త వేరియంట్ కారణంగా ఇండియాలో థర్డ్‌వేవ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. 

మరోవైపు ప్రపంచంలోని ప‌లు దేశాల్లో డెల్టా వేరియంట్‌(Delta Variant), ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలిసి సూపర్‌ స్ట్రెయిన్‌గా మారే విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది. డెల్టా వేరియంట్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలిసి సూపర్‌ స్ట్రెయిన్‌గా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని వైద్య నిపుణులు తెలిపారు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టా వేరియంట్‌, ఒమిక్రాన్‌ రెండూ సోకితే.. రెండు వేరియంట్లు పరస్పరం జన్యువుల్ని మార్చుకుని సూపర్‌ స్ట్రెయిన్‌‌గా(Super Strain)మారవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఇది మరింత ప్రమాదకరం కావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. 

Also read: Corona cases in India: దేశంలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- 2020 మార్చి స్థాయికి యాక్టివ్​ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News