Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు- మరణాల్లో స్వల్ప వృద్ధి

Corona cases in India: దేశంలో కరోనా కేసులు వరుసగా 8 వేల దిగువనే నమోదవుతూ వస్తున్నాయి. కొత్తగా 7,447 మందికి పాజిటివ్​గా తేలింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 10:31 AM IST
  • దేశంలో స్థిరంగా కరోనా ఉధృతి
  • మళ్లీ 8 వేల దిగువనే పాజిటివ్ కేసులు
  • స్వల్పంగా పెరిగిన కొవిడ్ మరణాలు
Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు- మరణాల్లో స్వల్ప వృద్ధి

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి 8 వేల దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,447 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,55,692 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది.

కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 391 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 7,886 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినప్పటికీ.. ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 86,415 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.25 శాతంగా ఉంది.

కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,76,869 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,726,049 మందికి కరోనా సోకగా.. అందులో 3,41,62,765 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 70,46,805 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,35,99,96,267 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 273,237,321 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,353,127 మంది మహమ్మారికి బలయ్యారు. 245,306,190 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 2,578,004 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Aadhar Benefit: ఆధార్ రాకతో ప్రభుత్వానికి రూ.2.25 లక్షల కోట్లు ఆదా!

Also read: Omicron In India: భారత్ ప్రమాదంలో ఉంది.. థర్డ్ వేవ్ తప్పదు! అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News