Income Tax Relaxation: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్య తరగతి ప్రజలకు నిరాశే మిగిలింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను వర్గాలకు ఎటువంటి ఊరట లభించలేదు. కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం ప్రశంసలు కురిపించారు.
Budget 2024: సార్వత్రిక ఎన్నికల ముందర ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై ప్రజల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఎన్నికల సమయం కావడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున తాయిలాలు ఇస్తుందనే ఆశల్లో ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో ఏం ఉంటాయో.. ఎలాంటి ప్రకటనలు ఉంటాయోననే చర్చ జరుగుతోంది. దేశమంతా ఇప్పుడు బడ్జెట్‌పైనే చర్చ జరుగుతోంది.
Budget 2024: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఎన్డీయే సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించబోతున్నదని సమాచారం. ప్రధాని మోదీ పాలనను మొదటి నుంచి నిరసిస్తున్న రైతులకు ఈ బడ్జెట్లో భారీ ప్రయోజనాలు కల్పించి వారిని శాంతపర్చాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సహాయం పెంపుతోపాటు మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట రాజకీయ వివాదానికి దారి తీసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా మారింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అధికార ఎన్డీయే కూటమి హాజరవుతుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి బహిష్కరించింది. ఫలితంగా ఆయా కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంబరాలు జరుగుతుండగా.. ప్రతిపక్ష కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ ఉత్సవానికి అంటిముట్టనట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది.
Photo War: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు పథకాలపై ఇరు పార్టీల నేతల మధ్య ఆరోపణలు సాగుతుండగా.. తాజాగా ఫోటో, ఫ్లెక్సీ రచ్చ సాగుతోంది.
Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కౌంటరిచ్చారు మంత్రి హరీష్ రావు.ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పడం హస్యాస్పదమన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందన్నారు.
Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో రెండవ రోజు పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో పర్యటించిన కేంద్రమంత్రి రేషన్ షాపును సందర్శించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే నిర్మలా సీతారామన్ లాగే ఉండాలంటున్నారు. మరి ఇంతకీ నిర్మలా సీతారామన్ పై నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటీ..?
బడ్జెట్ 2022-23ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎప్పటిలానే ఈ సారి కూడా బడ్జెట్ నిర్ణయాల వల్ల కొన్ని వస్తు, సేవల ధరలు పెరగటం, మరికొన్నింటి ధరలు తగ్గటం వంటివి జరగనున్నాయి.
Economic Survey 2022: బడ్జెట్ 2022 రేపు పార్లమెంట్ ముందుకు రానుంది. అంతకు ముందు నేడు ఆర్థిక సర్వే 2022ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సర్వేలోని ముఖ్యాంశాలు మీకోసం.
'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఐతే లాక్ డౌన్ వేళ పేద ప్రజల సంగతేంటి..? వారు ఆకలితో అలమటించాల్సిందేనా..? ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వ పరిష్కారం చూపించింది.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇవాళ లోక్ సభలో సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన ఆమె బడ్జెట్ ప్రసంగం 2 గంటల 19 నిముషాలు సాగింది. నిజానికి ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని 90 నిముషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆమె బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2020-2021 పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ చాలా పేలవంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో పెద్దగా చమక్కులు ఏమీ లేవన్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2020-2021 ఆర్ధిక సంవత్సర బడ్జెట్.. స్టాక్ మార్కెట్ ను నిరుత్సాహం నింపింది. బడ్జెట్ పై ఎన్నో ఆశలు, ఉత్సాహంతో ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి.
కేంద్ర బడ్జెట్ 2020-2021 ఉద్యోగులకు, చిన్న వ్యాపారాస్తులకు ఆశాజనకంగా నిలిచింది. ముందుగా ఊహించిన విధంగానే ఆదాయపు పన్ను శాతంలో భారీగా కాకపోయినా. . కొంత మేర లాభం కనిపించింది. ఆదాయపు పన్ను శాతాన్ని కాస్త తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సబ్ కా సాథ్ .. సబ్ కా వికాస్ .. సబ్ కా విశ్వాస్ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె తెలిపారు. అంత్యోదయులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా ప్రతిఫలాలు పేదలకు అందినప్పుడే సంక్షేమ పథకాలకు అర్థం ఉంటుందన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జరగనున్న ఈ సమావేశాల మధ్య మూడు వారాల విరామం కూడా వస్తోంది. జనవరి 31న సమావేశాలు ప్రారంభం ప్రారంభం కానుండగా.. అదే రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.