MPDO Attack: 'కూటమి ప్రభుత్వంలో అధికారుల పై దాడులు చేస్తే సహించేది లేదు' అని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చినా కూడా అహంకారం తగ్గలేదని పేర్కొన్నారు. అధికారం కోల్పోయినా వైఎస్సార్సీపీకి అహంకారం తగ్గలేదని చెప్పారు. ఎంపీడీఓపై దాడి హేయనీయమని.. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
Also Read: JC Prabhakar Reddy: ఎవరికీ భయపడను. ఇంట్లో ఉండే పెరుగన్నం తిని బతుకుతా
ఎంపీడీఓపై దాడి జరగగా బాధితుడు కడపలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాడి విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హుటాహుటిన కడపకు చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత ఎంపీడీఓను పరామర్శించారు. మీకు అండగా ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆస్పత్రిలో మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Also Read: YS Jagan: 'ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి' మాజీ సీఎం జగన్ భరోసా
ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించిన అధికారులపై దాడులు సరికాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎంపీడీవో కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఎంపీడీఓపై దాడిని హేయనీయమన్నారు. రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టమని వైసిపీ నేతలు ఎంపీడీఓ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురించేస్తున్నారని తెలిపారు. వైసీపీ అహంకారాన్ని తగ్గిస్తామని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తన అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఆదేశించినట్లు చెప్పారు.
రాయలసీమలో యువత.. ప్రజలు ఇలాంటి దాడులను ఎదుర్కోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఎంపీడీఓపై దాడి చేసిన న్యాయవాది సుదర్శన్ రెడ్డి చట్టాలు తెలుసని ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తే తగదని హెచ్చరించారు. సింహాద్రిపురంలో రైతు కుటుంబం ఆత్మహత్య విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆ ఘటనపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రైతు కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook