Niramala: మంచి మనసు చాటుకున్న నిర్మలా సీతారామన్‌, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!

Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే నిర్మలా సీతారామన్‌ లాగే ఉండాలంటున్నారు. మరి ఇంతకీ నిర్మలా సీతారామన్‌ పై నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటీ..?

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 04:33 PM IST
  • మంచి మనసు చాటుకున్న నిర్మలా సీతారామన్‌
  • ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
  • వీడియో షేర్‌ చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌
 Niramala: మంచి మనసు చాటుకున్న నిర్మలా సీతారామన్‌, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!

Nirmala Seetharaman: NSDL సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ముంబైలో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం Market Ka Eklavya అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం NSDL పోస్టల్‌ స్టాంపును కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. NSDL సంస్థ సీఈవో పద్మజ స్టేజీపై ప్రసంగిస్తున్నారు. ప్రసంగం మధ్యలో కొన్ని వాటర్‌ కావాలని అక్కడి సిబ్బందిని అడుగుతుంది పద్మజ. స్టేజీపైనే ఉన్న నిర్మలా సీతారామన్‌ అది విని ఓ గ్లాసుతో పాటు వాటర్‌ బాటిల్‌ ను తెచ్చి ఇచ్చారు. దీనికి పద్మజ థాంక్యూ మేడమ్‌ అని చెప్పారు. స్వయంగా కేంద్ర మంత్రియే వాటర్‌ తెచ్చి ఇవ్వడంతో ఆ ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. నిర్మలా సీతారామన్‌ కు మద్దతుగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఈ వీడియోను కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రదాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. నిర్మలా సీతారామన్‌ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ధర్మేంద్ర ప్రదాన్‌ షేర్‌ చేసిన వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు నిర్మలా సీతారామన్‌ లాగే ఉండాలంటున్నారు. మంచి మనసుచాటుకుంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మొత్తంగా ధర్మేంద్ర ప్రదాన్‌ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు నెటిజన్లు.  

Also Read:TS SPDCL Jobs: టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌లో 1270 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్

Also Read:CSK vs DC: ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు.. చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News