కేంద్ర బడ్జెట్ 2020-2021పై పెదవి విరిచిన రాహుల్ గాంధీ

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన  వార్షిక బడ్జెట్ 2020-2021 పై కాంగ్రెస్ పార్టీ  పెదవి విరిచింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ  కేంద్ర బడ్జెట్ చాలా పేలవంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  కేంద్ర బడ్జెట్ లో పెద్దగా చమక్కులు ఏమీ లేవన్నారు.

Last Updated : Feb 1, 2020, 02:52 PM IST
కేంద్ర బడ్జెట్ 2020-2021పై పెదవి విరిచిన రాహుల్ గాంధీ

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన  వార్షిక బడ్జెట్ 2020-2021 పై కాంగ్రెస్ పార్టీ  పెదవి విరిచింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ  కేంద్ర బడ్జెట్ చాలా పేలవంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  కేంద్ర బడ్జెట్ లో పెద్దగా చమక్కులు ఏమీ లేవన్నారు. ప్రజలు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు.  దేశంలో చాలా  పెద్ద ఎత్తున నిరుద్యోగం తాండవిస్తోందని  రాహుల్ గాంధీ తెలిపారు. అలాంటి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎలాంటి ఆశలు కల్పించలేదని విమర్శించారు. కేవలం తమ ప్రభుత్వం చేస్తున్నదంతా  బాగుందని చెప్పుకోవడానికే బడ్జెట్ లో ప్రాతినిథ్యం కల్పించారని తెలిపారు. ప్రజలపై మోదీ సర్కారుకు ఏమాత్రం ప్రేమ ఉందో ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని ఎద్దేవా చేశారు.  అంతే కాదు. . . గతంలో కంటే ఎక్కువ సేపు సాగిన బడ్జెట్ ప్రసంగం ఇదేనన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేశారు.

Trending News