బడ్జెట్ దెబ్బకు విలవిలలాడిన స్టాక్ మార్కెట్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2020-2021 ఆర్ధిక సంవత్సర బడ్జెట్.. స్టాక్ మార్కెట్ ను నిరుత్సాహం నింపింది.  బడ్జెట్ పై ఎన్నో ఆశలు, ఉత్సాహంతో ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. 

Last Updated : Feb 1, 2020, 02:17 PM IST
బడ్జెట్ దెబ్బకు విలవిలలాడిన స్టాక్ మార్కెట్

మదుపరులను నిరాశపరిచిన బడ్జెట్ 
ఇన్వెస్టర్లలో గందరగోళం 
భారీగా పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2020-2021 ఆర్ధిక సంవత్సర బడ్జెట్.. స్టాక్ మార్కెట్ ను నిరుత్సాహం నింపింది.  బడ్జెట్ పై ఎన్నో ఆశలు, ఉత్సాహంతో ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి దాదాపు 11 గంటల వరకు స్తబ్దుగానే కదిలిన స్టాక్ మార్కెట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో కాస్తంత పుంజుకున్నాయి. కానీ అది ఎక్కువ సేపు నిలువ లేదు. 11 గంటల తర్వాత దాదాపు 200 పాయింట్ల వరకు లాభపడిన బొంబే స్టాక్ ఎక్చేంజ్ సెన్సెక్స్ భారీగా పాయింట్లు నష్టపోయింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్  ప్రసంగంలో  ఆదాయపన్ను శ్లాబులు, శాతాలను ప్రకటించిన తర్వాత .. సెన్సెక్స్ 661 పాయింట్ల వరకు పడిపోయింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజీ నిఫ్టీ కూడా 200 పాయింట్లు కోల్పోయింది. దీంతో పెట్టుబడిదారులకు సంబంధించిన 2 లక్షల 40 వేల సంపద ఆవిరై పోయింది.

Trending News