PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు

Budget 2024: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఎన్డీయే సర్కార్‌ రైతులకు తీపి కబురు వినిపించబోతున్నదని సమాచారం. ప్రధాని మోదీ పాలనను మొదటి నుంచి నిరసిస్తున్న రైతులకు ఈ బడ్జెట్‌లో భారీ ప్రయోజనాలు కల్పించి వారిని శాంతపర్చాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్‌ సహాయం పెంపుతోపాటు మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 29, 2024, 11:11 PM IST
PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు

PK Kisan Yojana: సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో భారీ ప్రకటనలు ఉండనున్నాయని సమాచారం. వాటిలో రైతులకు భారీ కానుక ఉండనుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు పీఎం కిసాన్‌ రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం భారీగా పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్టుబడి సహాయం పెంచి రైతులకు లబ్ధి చేకూర్చాలని కేంద్ర భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న ప్రధాని మోదీ ప్రజలను ఆకర్షించేందుకు మరికొన్ని కొత్త పథకాలు, కానుకలు అందించాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలకు భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారని సమాచారం. వాటిలో రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచనున్నట్లు సర్వత్రా వినిపిస్తున్న మాట.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన మహాఉద్యమంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లు ఇంకా నెరవేర్చలేదు. నల్లచట్టాలను రద్దుచేసినా మిగతా డిమాండ్‌ నెరవేర్చకపోవడంతో ఫిబ్రవరిలో రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైతులను దృష్టిలో ఉంచుకుని వారిని చల్లబర్చేందుకు పీఎం కిసాన్‌ సహాయం పెంచనున్నట్లు సమాచారం. పీఎం కిసాన్‌ డబ్బులు ఇప్పటిదాకా 15 సార్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. నిర్మలమ్మ ప్రకటించే బడ్జెట్‌లో ఈ సహాయం రూ.9 వేలకు పెరిగే అవకాశం ఉంది. పీఎం కిసాన్‌ పెంపుతోపాటు జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల పెంపు, మద్దతు ధర వంటి వాటిలో కూడా రైతులకు తీపి కబురు వినిపించబోతున్నదని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Also Read: Kharge Sensational Comments: మోదీ హ్యాట్రిక్‌ కొడితే అసలు ఎన్నికలే ఉండవు.. అంతా నియంత పాలనే

Also Read: Mother Emotional Letter: కన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ కొడుకివి నువ్వే రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News