Cyclone Biparjoy Latest News: బిపోర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. గురువారం తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలకు దూరంగా తరలించి.. ముందస్తు చర్యలు చేపట్టారు.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జీతాలు మాత్రం జూలై నెలతో కలిపి అందజేయనున్నారు.
ఈసారి కూడా 4 శాతం డీఏ పెంచే అవకాశం ఉంది. డియర్నెస్ అలవెన్స్ 46 శాతానికి చేరితే.. ఏడాదికి జీతం పెరుగుతుంది..? వివరాలు ఇలా..
7th Pay Commission Latest Updates: ఈ ఏడాది కరువు భత్యం 4 శాతం పెంచడంతో డీఏ 42 శాతానికి చేరింది. రెండోసారి ఎంత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా విడుదల అవ్వడంతో డీఏ పెంపుపై ఓ క్లారిటీ వచ్చింది.
CM Ashok Gehlot Vs Sachin Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ పార్టీ వీడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.
Odisha Train Accident Death Count: ఒడిశా రైలు ప్రమాదంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన ఊపిరితో ఉన్న వ్యక్తులను కూడా మృతదేహాలలో కలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. మృతదేహాల మధ్యలో నుంచి ఓ వ్యక్తి పోలీస్ కాళు పట్టుకుని తాను బతికే ఉన్నానని చెప్పాడు.
200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. జూలై 1 నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Aguwani Sultanganj Bridge Collapse in Bihar: గంగా నదిపై బీహార్‌లో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే రెండోసారి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Coromandel Express Accident: విండో సీటు కోసం కోచ్ మారడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకున్నారు తండ్రీకూతుళ్లు. 8 ఏళ్ల కూతురు విండో సీటులోనే కూర్చుంటానని బెట్టు చేయడంతో తప్పని పరిస్థితుల్లో మూడు కోచ్‌లు మారి ఇతర ప్రయాణికులతో సీట్లు మార్చుకున్నారు. ఆ తరువాత కాసేపటికే రైలు ప్రమాదానికి గురైంది.
AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
Train Accident : రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Update on 7th Pay Commission DA Hike: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ డేటా వచ్చేసింది. మార్చి నెల కంటే ఈసారి ఎక్కువ పాయింట్లు పెరగడంతో డీఏ పెంపుపై ఓ స్పష్టత వచ్చింది.
7th Pay Commission ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్రాలు గత రెండు నెలల్లో వరుసగా శుభవార్తలు అందించాయి. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన తరువాత.. రాష్ట్రా ప్రభుత్వాలు కూడా కరువు భత్యం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Congress : కర్ణాటకలో తిరిగి అధికారం చేపట్టేలా తగిన వ్యూహాలు రచించిన సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి ఇచ్చి తగిన గౌరవాన్ని కల్పించింది. కర్ణాటక సీఎం సలహాదారుగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
India China Border News: LAC వద్ద చైనా రహస్యంగా తన బలాన్ని పెంచుకుంటోంది. దళాలను విస్తరిస్తూ.. ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా హెలిప్యాడ్లు, రైల్వే సౌకర్యాలు, క్షీపణి స్థావరాలను మెరుగుపరచుకుంటోంది.
Farmer Schemes in India by PM Modi: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 9 ఏళ్లు పదవీక కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రత్యేక పథకాలను రూపొందించింది.
Update on 7th Pay Commission: రాష్ట్ర ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. డీఏ పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘాన్‌లో భూకంప తీవ్రతను రిక్టారు స్కేలుపై 5.2గా గుర్తించారు.
TDP To Attend New Parliament Building Inauguration Ceremony: ఢిల్లీలో ఈ నెల 28న నిర్వహించనున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ హాజరుకానుంది. ఏపీ నుంచి అధికార, విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరకానుండడం విశేషం. కాగా.. దేశంలోని కాంగ్రెస్‌తో సహ 19 పార్టీలో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
7th Pay Commission DA Arrears: పంజాబ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 2015 నుంచి డిసెంబర్ 31, 2015 వరకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఆరు శాతం డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది.
New Dress Code For Govt School Teachers in Assam: ఇక నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుల డ్రెస్ కోడ్ మారనుంది. జీన్స్, టీషర్టులు, లెగ్గింగ్స్ ధరించి పాఠశాలకు వచ్చేందుకు వీల్లేదు. అయితే ఈ డ్రెస్ కోడ్ తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిర్ణయిస్తూ అస్సా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.