India China Border Clash: చైనా గుట్టురట్టు.. LAC వద్ద రహస్యంగా దళాల విస్తరణ

India China Border News: LAC వద్ద చైనా రహస్యంగా తన బలాన్ని పెంచుకుంటోంది. దళాలను విస్తరిస్తూ.. ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా హెలిప్యాడ్‌లు, రైల్వే సౌకర్యాలు, క్షీపణి స్థావరాలను మెరుగుపరచుకుంటోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 3, 2023, 12:19 PM IST
India China Border Clash: చైనా గుట్టురట్టు.. LAC వద్ద రహస్యంగా దళాల విస్తరణ

India China Border News: చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ సరిహద్దుల్లో తన బలాన్ని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజింగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) దగ్గర చైనా దళాలను విస్తరిస్తున్నట్లు శాటిలైట్ ఫొటోల ద్వారా వెల్లడైంది. 2020 మే  నెలలో LAC వెంట సైనిక ప్రతిష్టంభన ప్రారంభమైనప్పటి నుంచి చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది.

దళాల విస్తరణతోపాటు ఎయిర్‌ఫీల్డ్‌లు, హెలిప్యాడ్‌లు, రైల్వే సౌకర్యాలు, క్షీపణి స్థావరాలు, రోడ్లు, వంతెనల భారీ విస్తరణను వేగవంతం చేస్తోంది. హోటాన్, న్గారి గున్సా, లాసాలోని శాటిలైట్ చిత్రాలలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. చైనా కొత్త రన్‌వేలు, ఫైటర్ జెట్‌లు, సైనిక ఆపరేషన్ భవనాలను నిర్మించడానికి కొత్త డిజైన్ షెల్టర్‌లను నిర్మించింది.

2020 జూన్‌లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది మన సైనికులు అమరులైన విషయం తెలిసిందే. చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలిసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవ్వాలంటే.. LAC వద్ద సాధారణ స్థితి అవసరమని చైనాకు భారత్ చాలాసార్లు స్పష్టం చేసినా.. డ్రాగన్ కంట్రీ బుద్ధి మార్చుకోవడం లేదు.

నైరుతి జిన్‌జియాంగ్‌లోని హోటాన్ ఎయిర్‌ఫీల్డ్ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ రాజధాని లేహ్ నుంచి 400 కి.మీ.ల దూరంలో ఉంది. హోటాన్ ఎయిర్‌ఫీల్డ్ చివరిగా 2002లో విస్తరించగా.. 2020 జూన్ నెలలో తీసిన శాటిలైట్ చిత్రంలో కూడా ఎయిర్‌ఫీల్డ్ సమీపంలోని ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కనిపించలేదు.

Also Read: Bandi Sanjay: A నుంచి Z వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవే.. బండి సంజయ్ కౌంటర్

అయితే తాజా శాటిలైట్ చిత్రాలలో మాత్రం హోటాన్ ఎయిర్‌ఫీల్డ్‌లో కొత్త రన్‌వే, కొత్త ఎయిర్‌క్రాఫ్ట్, మిలిటరీ ఆపరేషన్స్ సపోర్ట్ బిల్డింగ్‌లు, కొత్త ఆప్రాన్ ఉన్నట్లు చూపిస్తోంది. హోటాన్ నుంచి మానవరహిత వైమానిక వాహనాలను పనిచేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

టిబెట్ అటానమస్ రీజియన్‌లోని న్గారి గున్సా ఎయిర్‌ఫీల్డ్ పాంగోంగ్ సరస్సు నుంచి సరళ రేఖలో 200 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ 2010లో ఎయిర్‌ఫీల్డ్ కార్యకలాపాలు ప్రారంభించింది. డోక్లామ్‌లో 2017 స్టాండ్‌ఆఫ్ తర్వాత విస్తరించారు. 2020 జూన్ నెలలో శాటిలైట్ చిత్రాలలో ఫైటర్ జెట్‌లతో కూడిన ఎయిర్‌క్రాఫ్ట్ ఆప్రాన్ మాత్రమే చూపింది.

కానీ తాజాగా మే నెల నుంచి కొత్త టాక్సీవే, రన్‌వేకి మెరుగుదలను చూపుతోంది. 16 కొత్త భారీ ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్‌లు, కొత్త ఎయిర్‌క్రాఫ్ట్, మిలిటరీ ఆపరేషన్స్ సపోర్ట్ భవనాలు కూడా శాటిలైట్ ఫొటోలలో స్పష్టమైంది. డ్రాగన్ కంట్రీ సెలైంట్‌గా LAC వద్ద దళాలను విస్తరిస్తూ.. అన్ని సౌకర్యాలను సిద్ధం చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. 

Also Read: Google New Rules: లోన్‌ యాప్‌లపై గూగుల్ కఠిన చర్యలు.. కొత్త నిబంధనలు ఇలా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News