7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఈ ఏడాది రెండో గిఫ్ట్ రాబోతుంది. రెండో డీఏ పెంపు కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న తరుణంలో ఎంత పెంపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంవత్సరం మొదటి డీఏ 4 శాతం పెంచిన విషయం తెలిసిందే.. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుకుంది. దీనిని 46 శాతానికి పెంచుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఏప్రిల్‌లో ఏఐసీపీఐ సూచీ డేటాను రిలీజ్ చేయగా.. ఇండెక్స్ గణాంకాల్లో పెరుగుదల కనిపించింది. దీంతో రెండో డీఏ కూడా నాలుగు శాతం ఉంటుందని అంటున్నారు. ఇదేజరిగితే ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉండనుంది.
ఈ ఏడాది రెండో డీఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ ఏఐసీపీఐ ఇండెక్స్ డేటాలో 0.72 శాతం పెరుగుదల కనిపించింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఏఐసీపీఐ సూచీ పెరగడంతో డీఏ పెంపుపై స్పష్టత వచ్చింది. మార్చిలో 133.3 పాయింట్ల వద్ద ఉండగా.. ఏప్రిల్ నెలలో 0.72 పాయింట్లు పెరిగి 134.02కు చేరుకుంది. దీన్ని బట్టి ఈసారి కూడా డీఏ పెంపు భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డీఏ పెంపు ప్రకటన వస్తే.. దేశంలోని 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 48 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్‌ను ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఏఐసీపీఐ ఇండెక్స్ డేటాను పరిశీలిస్తే.. ఫిబ్రవరి నెలలో మినహా మిగిలిన అన్ని నెలల్లో పెరుగుదల కనిపించింది. జనవరి నెలలో 132.8 పాయింట్ల వద్ద నుంచి మొదలైంది. ఫిబ్రవరిలో 132.7 పాయింట్లకు తగ్గింది. అనంతరం మార్చిలో 133.3 పాయింట్లకు పెరగ్గా.. ఏప్రిల్‌లో 134.02 పాయింట్లకు చేరుకుంది.
Also Read: Sachin Pilot: సచిన్ పైలట్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారా..? ఈ నెల 11న కీలక ప్రకటన..!
ఈ పాయింట్లను లెక్కిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 45 శాతం దాటి 45.04 శాతానికి చేరుకుంది. మరో రెండు నెలల డేటా అంటే.. మే, జూన్‌ల ఏఐసీపీఐ ఇండెక్స్ పాయింట్లను బేస్ చేసుకుని డీఏ ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రతి నెల చివరి పని దినం నాడు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) డేటాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook