Free Electricity Scheme: 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. జూలై 1 నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 6, 2023, 08:09 PM IST
Free Electricity Scheme: 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచి తీపి కబురు అందించిన సీఎం సిద్దరామయ్య.. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని మంగళవారం తెలిపారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన ఐదు ఎన్నికల హామీలలో ఒకటైన 'గృహ జ్యోతి' ఉచిత విద్యుత్ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు. 

గృహ వినియోగదారులకు గ్యారెంటీ 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ పథకం గృహావసరాలకు మాత్రమే వర్తిస్తుందని.. వాణిజ్య కనెక్షన్లకు కాదని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనతో కర్ణాటన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఉచిత విద్యుత్ పథకం కండీషన్లు ఇవే..

==> గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. సగటు వినియోగం కంటే 10 శాతం వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తుంది.
==> వినియోగదారుడు సగటున నెలకు 150 యూనిట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తే.. 165 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. పరిమితిని మించి వినియోగిస్తే.. ఎక్కువ వినియోగించిన మిగిలిన యూనిట్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నికర విద్యుత్ వినియోగం అవుతుంది.
==> అయితే 200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటితే వినియోగదారుడు విద్యుత్ బిల్లు పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 వరకు ఉన్న బకాయిలను మూడు నెలల్లోగా వినియోగదారులు చెల్లించాలి.
==> విద్యుత్ మీటర్ వినియోగం, మీటర్ రీడింగ్‌ను తప్పనిసరి చేశారు. మొత్తం విద్యుత్ వినియోగం నెలవారీ బిల్లులో ప్రదర్శిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
==> ప్రతి లబ్ధిదారుడు కస్టమర్ ఐడీ లేదా ఖాతా ఐడీని ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి. ఒక వినియోగదారుడు ఒకటి కంటే ఎక్కువ విద్యుత్ మీటర్లను లింక్ చేయలేరు.
==> ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే వారు రాష్ట్ర ప్రభుత్వ 'సేవా సింధు' పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
==> వినియోగదారులకు అందజేసే ఉచిత విద్యుత్‌ ఖర్చును విద్యుత్ సరఫరా కంపెనీలకు పరిహారంగా చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Also Read: Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్  

 Also Read: Ration Dealers Strike: గుడ్‌న్యూస్.. రేషన్‌ షాపులు ఓపెన్.. సమ్మెపై విరమించిన రేషన్ డీలర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News