Afghanistan Earthquake: ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం స్వల్ప భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఉదయం 11.23 గంటల ప్రాంతంలో సంభవించాయని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. చండీగఢ్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, పూంచ్‌లలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు చెప్పారు. ఇండియాస్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ సమీపంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 79 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఏజెన్సీ తెలిపింది. ఉదయం 11:19 గంటలకు ఉపరితలానికి 220 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 3.3-3.5 తీవ్రతతో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. సాయంత్రం 5.15 గంటలకు మొదటి ప్రకంపనలు.. సాయంత్రం 5.28 గంటలకు రెండో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ సమీపంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయని వెల్లడించారు. అయితే ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, పెషావర్, స్వాత్, హరిపూర్, మలాకంద్, అబోటాబాద్, పిండ్ దాదన్ ఖాన్, బుత్‌గ్రామ్ తదితర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించిందని పేర్కొన్నారు.
భూకంపాలకు కారణం ఇదే..
భూమి లోపల ఉండే ప్లేట్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడల్లా.. ఒక ఫాల్ట్ లైన్ జోన్ ఏర్పడుతుంది. దీని కారణంగా ఉపరితలం మూలలు మూడుచుకుని.. ఒత్తిడి పెరిగి ప్లేట్లు విరిగిపోతాయి. ఈ ప్లేట్ల విచ్ఛిన్నం కారణంగా.. లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ఓ దారి ఏర్పాటు చేసుకుంటుంది. దీని కారణంగా భూకంపం సంభవిస్తుంది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రతను కొలుస్తారు.
Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి