7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈసారి డీఏ DA పెరగనుందంటే..?

Update on 7th Pay Commission DA Hike: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ డేటా వచ్చేసింది. మార్చి నెల కంటే ఈసారి ఎక్కువ పాయింట్లు పెరగడంతో డీఏ పెంపుపై ఓ స్పష్టత వచ్చింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 4, 2023, 01:01 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈసారి డీఏ DA పెరగనుందంటే..?

Update on 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే రానుంది. ఈ ఏడాది తొలి డీఏ 4 శాతం పెంచగా.. రెండో డీఏ ఎంత పెరగనుందో క్లారిటీ రానుంది. తాజాగా ఏప్రిల్‌లో ఏఐసీపీఐ సూచీ డేటాను రిలీజ్ చేసింది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డీఏ పెంపుపై ఓ స్పష్టత వచ్చింది. ఏప్రిల్‌ నెలలో ఏఐసీపీఐ ఇండెక్స్‌ గణాంకాల్లో పెరుగుదల కనిపించడంతో.. డీఏ పెంపు కూడా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండో డీఏ కూడా 4 శాతం పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం డీఏ 42 శాతం ఉండగా.. 46 శాతానికి పెరుగుతుందని చెబుతున్నారు.  

ఈ ఏడాదికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డీఏ ఉండేది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏను పెంచింది. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది. పెంచిన డీఏను జనవరి నెలను వర్తింపజేసింది. రెండో డీఏ ప్రకటన కూడా ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. రెండో పెంపు ప్రకటన ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది.

ఏప్రిల్ నెలకు సంబంధించిన డేటాను ఏఐసీపీఐ విడుదల చేసింది. మార్చి నెలతో పోలిస్తే.. ఏప్రిల్‌లో ఏఐసీపీఐ సూచీ పెరిగింది. మార్చిలో 133.3 పాయింట్ల వద్ద ఉండగా, ఇప్పుడు 0.72 పాయింట్లు పెరిగి 134.02కు చేరుకుంది. దీన్ని బట్టి ఈసారి కూడా డీఏ ఎక్కవగానే పెరుగుతుందని స్పష్టమవుతోంది. ఏఐసీపీఐ ఇండెక్స్‌లో 0.72 పాయింట్లు పెరగడంతో 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 48 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.  

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ నెల వరకు చూసుకుంటే.. ఏఐసీపీఐ ఇండెక్స్‌ పాయింట్లు ఫిబ్రవరిలో తగ్గాయి. మిగిలిన నెలల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో 132.8 పాయింట్ల వద్ద ఉంది. ఫిబ్రవరిలో 132.7 పాయింట్లకు తగ్గిపోగా.. మార్చిలో 133.3 పాయింట్లకు పెరిగింది. ఇప్పుడు ఏప్రిల్‌లో 134.02 పాయింట్లకు చేరింది. ప్రస్తుతం పాయింట్ల ప్రకారం డీఏ 45 శాతం దాటి 45.04 శాతానికి చేరుకుంది. మే, జూన్‌ల ఏఐసీపీఐ ఇండెక్స్‌ సంఖ్య ఆధారంగా డీఏ పెంపుపై పూర్తి క్లారిటీ రానుంది. డీఏ 45 శాతం దాటడంతో ఈసారి కూడా 4 శాతం నుంచి 46 శాతానికి పెరుగుతుందని స్పష్టమవుతోంది. మార్చి లెక్కల ఆధారంగా డీఏ స్కోరు 44.46 శాతంగా ఉంది.

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్రాల ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఒకేసారి జీతం భారీగా పెంపు..!

జీతం ఎంత పెరుగుతుంది..?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.18 వేలు అయితే.. దానిపై 42శాతం డియర్‌నెస్ అలవెన్స్ అంటే రూ.7560. డీఏను 46 శాతానికి పెంచితే.. రూ.8280కి చేరుతుంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ.720 జీతం పెరగనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌లో ప్రభుత్వం ఎంత పెంచాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి నెల చివరి పనిదినం నాడు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా ఏఐసీపీఐ డేటాను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News