Revanth Reddy Slams KCR: ప్రగతి భవన్ని నక్సలైట్లు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తప్పుపడుతూ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈటల రాజేందర్ టార్గెట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిపెట్టింది. హుజురాబాద్ కోటలపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది.
ముంబైలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గురువారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి ఆయన చర్చించారు.
KTR On Auctioning Of Singareni Coal Mines: సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని.. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేసిందని మండిపడ్డారు.
Minister Ktr Letter To Telangana Youth: నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుందని జోస్యం చెప్పారు.
Minister KTR Review Meeting: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.
Hyderabad Metro Second Phase: హైదరాబాద్ మెట్రో రెండో దశకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Hyderabad Second Phase Metro: హైదరాబాద్ నగరంలో రెండో దశ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను నిర్మించనుంది. మొత్తం 31 కిలోమీటర్లు ఉండగా.. 6 వేల 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
Yadagirigutta Leaders Rejoins In Congress: మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు సాయంత్రానికే ఝలక్ ఇచ్చారు. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుని కేటీఆర్ పరువు తీశారు.
PAGE Industries in Telangana: ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్‌ను స్థాపించనున్నట్టు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంతో పాటు సిద్దిపేట జిల్లా ములుగులోనూ 25 ఎకరాల విస్తీర్ణంలోనూ భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెలిపారు.
Hyderabad Metro Second Phase DPR: కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. శరవేగంగా పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
YS Sharmila Challenge to KTR: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన స్టైలులో ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కి కౌంటర్ ట్వీట్ చేసిన షర్మిల.. ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు.
Komatireddy Venkat Reddy to KTR: మంత్రి కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ తనను కోవర్ట్ అని సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తనను అలా పిలవడానికి నీకున్న అర్హత ఏంటో చెప్పాల్సిందిగా నిలదీశారు.
Minister KTR: టీఆర్ఎస్ పార్టీ..బీఆర్ఎస్గా మారిన తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్..బీజేపీపై ఫైర్ అయ్యారు.
Swachh Survekshan 2022: తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో సత్తా చాటింది. అన్ని విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.
Telangana Intelligence Wing Lands In Soup: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగం వైఫల్యం మరోసారి బయటపడింది. ఐతే, అదే సమయంలో, రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీమ చిటుక్కుమన్నా పసిగట్టే ఇంటెలీజెన్స్ విభాగం వ్యవస్థ నిజంగానే వీఆర్ఏల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పసిగట్టలేకపోయిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.