YS Sharmila to KTR: కేటీఆర్‌ను ఇరకాటంలో పడేసేలా వైఎస్ షర్మిల ట్వీట్

YS Sharmila Challenge to KTR: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన స్టైలులో ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కి కౌంటర్ ట్వీట్ చేసిన షర్మిల.. ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. 

Written by - Pavan | Last Updated : Oct 28, 2022, 08:33 AM IST
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై మంత్రి కేటీఆర్ ట్వీట్
  • మంత్రి కేటీఆర్ ట్వీట్‌కి ఘాటుగా రిప్లై ఇచ్చిన వైఎస్ షర్మిల
  • మౌనంగా ఉంటే తప్పు చేసినట్టేనని స్ట్రాంగ్ కౌంటర్
YS Sharmila to KTR: కేటీఆర్‌ను ఇరకాటంలో పడేసేలా వైఎస్ షర్మిల ట్వీట్

YS Sharmila Challenges KTR: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ స్పందించకూడదంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొరిగే వాళ్లు మొరుగుతూనే ఉంటారు.. మీరు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఘాటుగా స్పందించిన వైఎస్ షర్మిల.. మీ ఎమ్మెల్యేలు నిజంగానే నిర్దోషులే అయితే.. మీకు అంత నమ్మకమే ఉంటే.. వెంటనే ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించండి అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.  

 

ఎమ్మెల్యేల కొనుగోలుతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్మాలని అనుకున్నది ఎవడో.. కొనాలని అనుకున్నది ఎవడో నిగ్గు తేల్చండి అంటూ మంత్రి కేటీఆర్‌ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దొరెవడో, దొంగెవడో.. దోషి ఎవడో... నిర్దోషెవడో బయటపెట్టండని షర్మిల నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నీతిమంతుడు ఎవడో.. రాజకీయ వ్యభిచారి ఎవడో ప్రజలకు తెలియాలి అంటూ షర్మిల ఘాటైన పదజాలంతో టీఆర్ఎస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనను తెలంగాణలో అహంకారానికి, ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవ అమ్మకానికి మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగం క్రీడగా షర్మిల అభివర్ణించారు. 

 

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన ప్రజా ప్రస్థానం యాత్రలోనూ వైఎస్ షర్మిల ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొనడానికి వచ్చారని చెబుతున్న బీజేపి వాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు దాస్తున్నారు అని నిలదీశారు.

టీఆర్ఎస్ పార్టీ చెబుతున్నట్టుగా ఆ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిజం ఏదైనా దొరికిన దొంగలను తెలంగాణ సమాజం నుంచి వెలివేయాలని వైఎస్ షర్మిల పట్టుపట్టారు. అంతేకాకుండా ఈ విషయంలో తన సవాలుకు స్పందించకుండా మౌనం పాటిస్తే.. మౌనం అర్ధాంగీకారం అనుకోవాల్సి ఉంటుంది చిన్న దొర అంటూ చురకలంటించారు. ఈ మొత్తం వ్యవహారంపై మీరు సీబీఐ ఎంక్వైరీ వేయకుండా తప్పుకుంటే.. ఇందులో కచ్చితంగా మీ తప్పు ఉందని అంగీకరించినట్టుగానే భావించాల్సి ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టంచేశారు. మౌనంగా ఉంటే తప్పు అంగీకరించినట్టే అని వైఎస్ షర్మిల చేసిన ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ ( Minister KTR ) లైట్ తీసుకుంటారా లేక రిప్లై ఇస్తారా ? ఒకవేళ స్పందిస్తే ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.

Also Read : TRS MLAs Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Also Read : TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు

Also Read : BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై ధర్మపురి సెటైర్లే సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News