Komatireddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి సెటైర్లు.. మరి నీ సిస్టర్ సంగతేంటని ఎద్దేవా

Komatireddy Venkat Reddy to KTR: మంత్రి కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ తనను కోవర్ట్ అని సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తనను అలా పిలవడానికి నీకున్న అర్హత ఏంటో చెప్పాల్సిందిగా నిలదీశారు. 

Written by - Pavan | Last Updated : Oct 11, 2022, 08:11 PM IST
  • మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్ల వర్షం
  • అమెరికాలో చదువుకున్నావా.. గుంటూరు గల్లీల్లోనా..?
  • నీ సిస్టర్ కవిత సంగతేంది కేటీఆర్...
  • పదెకరాలు కూడా లేని నీకు వేల కోట్లు ఎక్కడివి ?
  • మీ నాయిన కేసీఆర్‌ను అడుగు నేనేందో
Komatireddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి సెటైర్లు.. మరి నీ సిస్టర్ సంగతేంటని ఎద్దేవా

Komatireddy Venkat Reddy to KTR: మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశించి అనేక ప్రశ్నలు సంధించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నీ కుటుంబంలా కమిషన్లతో బతకలేదని.. నిజాయితీతో బతికానని అన్నారు. రాజకీయం అంటే అప్పనంగా అధికారం అనుభవిస్తూ కోట్ల రూపాయల్లో అవినీతి చేయడం కాదని.. ఓవైపు అమరుల ఆత్మలు ఘోషిస్తోంటే విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం కూడా అసలే కాదని కోమటిరెడ్డి మండిపడ్డారు. 

అమెరికాలో చదువుకున్నావా.. గుంటూరు గల్లీల్లోనా..?
మంత్రి కేటీఆర్ భాష, పద్ధతి చూస్తోంటే.. ఆయన అమెరికాలో చదువుకున్నాడా లేక గుంటూరు గల్లీల్లోనా అనే సందేహం కలుగుతోందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అసలు నీకు తెలంగాణ ఎలా వచ్చిందో తెలుసా అని కేటీఆర్ ని సూటిగా ప్రశ్నించారు. ఎవరెవరు ప్రాణత్యాగాలకు సిద్ధపడితే తెలంగాణ వచ్చింది, ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది అనే విషయాలు ఏమైనా తెలుసా అని నిలదీశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మొట్టమొదట ఆమరణదీక్షకు కూర్చున్నది ఎవరో తెలుసా నీకు.. ఒకవేళ తెలియకపోతే చిన్నపిల్లాడినైనా అడుగు.. ఆ త్యాగం చేసింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని చెబుతారు. 

మంత్రి కేటీఆర్‌పై సెటైర్ల వర్షం
కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేటీఆర్‌పై సెటైర్ల వర్షం కురిపించారు. తెలంగాణ సాధన కోసం తాను పోరాటం చేస్తున్న సమయంలో నువ్వు నిక్కర్లేసుకుని ఆడుకుంటుంటావేమో అని మంత్రి కేటీఆర్‌ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాను మంత్రి పదవిని గడ్డిపోచలా వదులుకుని చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఉప్పెనై రగిలితేనే తెలంగాణ వచ్చిందనే విషయం తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకో అన్నారు. సాగర హారంలో నన్ను తాకిన రబ్బరు బుల్లెట్లను అడుగు లేదంటే నా వెనకేలే నడిచిన లక్షల మంది జనాన్ని అడుగు.. తెలంగాణలో ఎవరు ప్రజా నాయకులో.. ఎవరు కోవర్టులో చెబుతాయని నిలదీశారు.

నీ సిస్టర్ కవిత సంగతేంది కేటీఆర్...
తనను నిందించే ముందు నీ సిస్టర్ సంగతి ఏంటో చూసుకో కేటీఆర్ అంటూ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్ వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కోడై కూస్తున్న నేషనల్ మీడియాను అడిగితే కోవర్టులు ఎవరో వాళ్లే చెబుతారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. నిత్యం ఐటి దాడులు, ఈడి దాడులు ఎవరి అనుచరులపై జరుగుతున్నాయో, ఎవరు అరెస్ట్ అవుతున్నారో న్యూస్ చూసే జనానికి తెలుసని.. వాళ్లను అడిగితే కోవర్టులు ఎవరో చెబుతారని ఎద్దేవా చేశారు. 

పదెకరాలు కూడా లేని నీకు వేల కోట్లు ఎక్కడివి ?
పట్టుమని పదెకరాల భూమి లేని నీకు ఇవాళ వేల కోట్ల ఆస్తులు, ఇంత వైభోగం ఎక్కడి నుంచో వచ్చిందో నిజాయితీగా చెప్పగలవా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. నువ్వు ఢిల్లీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నావు కనుకే ఇంత అవినీతికి పాల్పడుతున్నా.. నీ మీద ఈగ వాలడం లేదంటూ మంత్రి కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

మీ నాయిన కేసీఆర్‌ను అడుగు నేనేందో
మీ నాయిన కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలోనే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 13 రోజులు నిరాహార దీక్ష చేశాను. ఆయన్ను అడుగు నేనంటే ఏంటో అని అన్నారు. నల్గొండ జిల్లా వాసులకు ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి కల్పించాలని తాను పోరాటం చేస్తే.. తనకు ఎక్కడ పేరొస్తుందో ఏమోననే భయంతో నీళ్లే రాకుండా చేసిన మీరా నన్ను కోవర్టులు అనేది అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు తన లెటర్‌హెడ్‌పైనే ఆయన బహిరంగంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Also Read : KTR HOT COMMENTS: బఫూన్ గాళ్లతో వేగలేం.. మునుగోడు బరి నుంచి తప్పుకుంటాం! కేటీఆర్ సంచలన ప్రకటన

Also Read : Komatireddy Rajgopal Reddy: 2018 కంటే 9 రెట్లు పెరిగిన రాజగోపాల్ రెడ్డి ఆస్తి! మునుగోడు ఉపసమరంలో రచ్చరచ్చ..

Also Read : Munugode Bypoll: కాంగ్రెస్ కార్యాలయం దగ్ధం.. మునుగోడులో కలకలం.. రేవంత్ రెడ్డి రాకతో హై టెన్షన్

Also Read : Munugode Posters: ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే.. మునుగోడులో పోస్టర్ల కలకలం

Also Read : Munugode Bypoll: కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్.. కమలంలో కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News