Legal notice to Revanth Reddy in Minister KTR's defamation suit: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో డిఫేమేషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రాగా.. మంత్రి కేటీఆర్ తరపు అడ్వకేట్ తన వాదనలు వినిపించి అందుకు తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.
KTR Vs Revanth twitter war: డ్రగ్స్ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానన్నారు రేవంత్. అక్కడితో ఆగలేదు. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నాన్నట్లు పేర్కొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు.
YS Sharmila speech at Nirudyoga nirahara deeksha: ఖమ్మం: నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం (Unemployment) పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
L Ramana joins TRS party ahead of Huzurabad bypolls: హైదరాబాద్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీటీడీపీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఎల్ రమణ.. సోమవారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ABVP workers protests against Minister KTR: నారాయణపేట: మంత్రి కేటీఆర్ చేపట్టిన జిల్లా పర్యటనలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణ ప్రగతిలో భాగంగా పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు (ABVP activists) అడ్డుకున్నారు.
Etela Rajender to join BJP: కరీంనగర్: ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీసీలను మోసం చేసిన ఈటల రాజేందర్‌కు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.
Junior doctors strike: తెలంగాణ జూనియర్ డాక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల వేళ వైద్యులు సమ్మెకు దిగడంపై వ్యతిరేకత వస్తోంది. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వమూ హెచ్చరిస్తోంది.
Granules india to supply 16 cr Paracetamol 500 mg tablets: హైదరాబాద్: కరోనాపై పోరులో తమ వంతు కృషిగా తెలంగాణ ప్రభుత్వానికి 16 కోట్ల పారాసిటమోల్ ట్యాబ్లెట్స్ ఉచితంగా అందివ్వనున్నట్టు పారాసిటమోల్ ట్యాబ్లెట్ల తయారీలో పేరున్న ఫార్మాసుటికల్ కంపెనీ అయిన గ్రాన్యుయెల్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్స్ విలువ 8 కోట్లు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Konda Vishweshwar Reddy supports Eetela Rajender: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు మంత్రి కేటీఆర్‌కు లేవని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వైఖరి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితు, పలువురు నేతల తీరుతెన్నులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
New pensions and ration cards in Telangana: తెలంగాణలో ఎప్పటి నుంచో పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వేచిచూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంటూ వచ్చిన దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ (CM KCR) నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Nagarjuna sagar Bypoll: తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల కోసం టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. ఆపరేషన్ నాగార్జునసాగర్ ప్రారంభించింది. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు గులాబీ నేతలు.
GHMC Mayor elections: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల విషయంలో TRS party, MIM party మాట ఒక్కటేనని BJP ముందు నుంచి చెబుతున్న మాట నేడు జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికతో నిజమైందని బీజేపి కార్పోరేటర్స్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు లేదని ఒకరిపై మరొకరు పరస్పరం ప్రత్యారోపణలు, దూషణలు చేసుకున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు.. ఇవాళ ఎలా కలిసిపోయాయని BJP కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Telangana New IT Policy: తెలంగాణలో నూతన ఐటీ పాలసీ రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ఐదేళ్లు పూర్తి కావస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని..మంత్రి కేటీఆర్ తెలిపారు.
Non-Agricultural properties registration | హైదరాబాద్: నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ఊపందుకోనుంది. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 200 నుంచి 300 మధ్య ఓట్ల తేడాతోనే ఓటమిపాలైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్టుగా మరో 20-25 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భావించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Double Decker buses: గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగెట్టనున్నాయి. ఓ వ్యక్తి చేసిన ట్వీట్..మంత్రి కేటీఆర్ సూచనతో అధికారులు సిద్ధమయ్యారు. బస్సుల కొనుగోలుకు రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ శనివారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్‌లో జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. నగరంలో ఆరేండ్ల కిందకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఓటర్లకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.
ట్విట్టర్ వేదికపై యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఓ సభలో తన ఫోటో తీసిన చిన్నారిని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ కేటీఆర్ మనస్సు దోచుకున్న ఆ చిన్నారి ఎవరు..
హైదరాబాద్ పేరు మార్పిడిపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే..హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.