Swachh Survekshan 2022: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణకు అవార్డుల పంట..ఎంపికైన మున్సిపాలిటీలు ఇవే..!

Swachh Survekshan 2022: తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో సత్తా చాటింది. అన్ని విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. 

Written by - Alla Swamy | Last Updated : Sep 24, 2022, 08:41 PM IST
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022
  • తెలంగాణకు అవార్డుల పంట
  • ఎంపికైన మున్సిపాలిటీలు
Swachh Survekshan 2022: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణకు అవార్డుల పంట..ఎంపికైన మున్సిపాలిటీలు ఇవే..!

Swachh Survekshan 2022: జాతీయ స్థాయిలో తెలంగాణ మరోమారు సత్తా చాటింది. మరోమారు జాతీయ స్థాయిలో మున్సిపాలిటీలు భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో 16 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో రేటింగ్ ఇచ్చి అవార్డులకు ఎంపిక చేసింది. పారిశుద్ధ్యం, మున్సిపల్ సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రజల్లో అవగాహన కల్పించారు.

దేశవ్యాప్తంగా 4 వేల 355 స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో తెలంగాణలోని 16 మున్సిపాలిటీలు సత్తా చాటి..అవార్డులను గెలుచుకున్నాయి. మొత్తం 90 అంశాలను ప్రాతిపదికన తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. శాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు వంటి అంశాల వారిగా అవార్డులను ఎంపిక చేశారు. అవార్డులకు ఎంపికైన స్థానిక సంస్థలకు అక్టోబర్ 1న అవార్డులను పంపిణీ చేయనున్నారు.

ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రంలోని 70 పట్టణ స్థానిక సంస్థలను ODF+ గా, 40 పట్టణ స్థానిక సంస్థలకు ODF++గా ప్రకటించారు. పట్టణ స్థానిక సంస్థను వాటర్+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ODF పట్టణాలుగా గుర్తించారు. తెలంగాణలోని మున్సిపాలిటీలకు అవార్డులు దక్కడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని మున్సిపల్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 

పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల గుణాత్మకమైన మార్పు సాధ్యమయ్యిందన్నారు. కేవలం పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా..పట్టణాలకు ప్రతి నెల బడ్జెట్ కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. పట్ణణాల్లో పారిశుద్ధ్యం, డైనేజీ, పార్కుల అభివృద్ధి, పట్టణ హరిత వనాల ఏర్పాటు దృష్టి పెట్టామన్నారు. 

 
అవార్డులు దక్కించుకున్న మున్సిపాలిటీ ఇవే..!

* ఆది బట్ల
* బడంగ్‌పేట్
* భూత్‌పూర్
* చండూర్
* చిట్యాల
* గజ్వేల్
* ఘట్ కేసర్
* హుస్నాబాద్
* కొంపల్లి
* కోరుట్ల 
* కొత్తపల్లి
* నేరుడుచర్ల
* సికింద్రాబాద్
* సిరిసిల్ల
* తుర్కయాంజల్
* వేములవాడ

Also read:IND vs AUS: ఆర్‌సీబీ కాదు..ఇది ఇండియా..అభిమానులపై విరాట్ కోహ్లీ అసంతృప్తి..!

Also read:MS Dhoni: రేపు సోషల్‌ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News