Hyderabad Metro: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రెండో దశ మెట్రోకు ముహుర్తం ఫిక్స్

Hyderabad Second Phase Metro: హైదరాబాద్ నగరంలో రెండో దశ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.  మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను నిర్మించనుంది. మొత్తం 31 కిలోమీటర్లు ఉండగా.. 6 వేల 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 04:22 PM IST
Hyderabad Metro: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రెండో దశ మెట్రోకు ముహుర్తం ఫిక్స్

Hyderabad Second Phase Metro: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండో దశ మెట్రోకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండో దశ పనులకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శుంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మొత్తం 31 కిలోమీటర్లు ఉండగా.. 6 వేల 250 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. 

రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని  శిల్పాలేఅవుట్‌ నుంచి నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. మెట్రో రైలు విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు సహకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా తప్పకుండా రెండో దశను పూర్తి చేస్తామన్నారు. మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్లు మొత్తం కలిపి 63 కిలోమీటర్లు మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మరో ఐదు కిలోమీటర్ల మెట్రో నిర్మాణంపై కేటీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

సెకెండ్ ఫేజ్ మెట్రో అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోకరంగా మారనుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సులభంగా నగరానికి చేరుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం సహకరించపోయినా మెట్రో నిర్మించి తీరుతామని కేటీఆర్ చెబుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి ఫేజ్‌లాగానే ఈ మెట్రోను కూడా పీపీపీ మోడల్‌లోని నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. డిసెంబర్ 9న శంకుస్థాపన సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. 

Also Read: PM Narendra Modi: నరేంద్ర మోదీ గురువు కన్నుమూత.. ట్విట్టర్‌లో ప్రధాని ఎమోషనల్  

Also Read: Sanju Samson: సౌత్‌ ప్లేయర్ అని వివక్ష.. రిషబ్ పంత్ కోసం సంజూ శాంసన్‌ కెరీర్ నాశనం చేసిన బీసీసీఐ!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News