BJP slams KCR, KTR: టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు వరి ధాన్యం కొనుగోలుపై పరస్పర ఆరోపణలు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాజాగా సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి ఆహ్వానం విషయంపై మాటల యుద్ధానికి దిగాయి.
Minister KTR counter to PM Modi: కోఆపరేటివ్ ఫెడరలిజం స్పూర్తితో రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. వ్యాట్ తగ్గించలేదంటూ రాష్ట్రాల పేర్లను ప్రస్తావించడం ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రశ్నించారు.
Cm Kcr Plenary: టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు..తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్లీనరీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటని..ఎవ్వరూ కూడా బద్దలు కొట్టని కోట అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని చెప్పారు.
Revanth Reddy Challanges CM KCR: సంచలనం రేపుతోన్న హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
DK vs KTR over IT infra in Hyderabad and Bengaluru: ఇటీవల ప్రముఖ స్టార్టప్ సంస్థ 'ఖాతాబుక్' సీఈవో రవీష్ నరేష్ చేసిన ట్వీట్ కేటీఆర్-శివ కుమార్ మధ్య ఆసక్తికర సంభాషణకు దారితీసింది. బెంగళూరులో మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రవీష్ ట్వీట్ చేయగా దానిపై కేటీఆర్ స్పందించారు.
Rahul Gandhi vs Minister KTR: హైదరాబాద్: తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తీవ్రంగా ఖండించారు.
Telangana budget sessions 2022: అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరితో పాటు సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. సర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.
Minister Errabelli Dayakar Rao speech: 2022-23 సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన మొత్తం బడ్జెట్ 25 వేల 98 కోట్ల 45 లక్షల 55 వేల (పంచాయతీ రాజ్ శాఖ 12 వేల 811 కోట్ల 92 లక్షల 11 వేలు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 12 వేల 286 కోట్ల 63 లక్షల 44వేలు) రూపాయలను శాసన సభ ఆమోదం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపాదించారు. అంతకు తగ్గని విధంగా బడ్జెట్‌ని ఆమోదించాల్సిందిగా అభ్యర్థించారు.
KTR Assembly Speech: హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని అంశాలపై కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Bheemla Nayak Pre Release Event Live Link: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ప్రారంభమైంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లలేని అభిమానులు ఈ ఈవెంట్ లైవ్‌ని ఆన్లైన్లో వీక్షిస్తున్నారు.
Revanth Reddy slams Minister KTR on KCR birthday: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకలను మూడు రోజులు జరుపుకోవాలన్న పిలుపును తీవ్రంగా తప్పుపట్టిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై అసహనం వ్యక్తంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
KTR on Modi over Jobs and Hijab: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ఓ సెటైరికల్ కార్టూన్‌ను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దేశ యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. ప్రధాని మోదీ హిజాబ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నట్లుగా ఆ కార్టూన్‌ను చిత్రీకరించారు.
Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలె బీజేపిలో చేరిన తీన్మార్ మల్లన్నకు అంతకంటే ముందు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందలేదా ? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నాను అని చెబుతున్న తీన్మార్ మల్లన్న మాటల్లో ఆంతర్యమేంటి ? 2023 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తారా ? చేస్తే ఎక్కడి నుంచి బరిలో నిలబడతారు ? తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా ? ఇవే కాదు.. ఇలాంటి ఇంకెన్నో సందేహాలకు స్వయంగా తీన్మార్ మల్లన్న నోటే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు జీ తెలుగు న్యూస్ డిజిటల్ టీవీ ఎడిటర్ భరత్.
KTR responds to 7 year old boy letter: తమ కాలనీలో ఫుట్‌పాత్ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరిపి అలాగే వదిలేశారని పేర్కొంటూ సికింద్రాబాద్‌కి చెందిన ఓ బాలుడు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు.
Attack on Teenmar Mallanna at Shanarthi Telangana office: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బూతులు (Boothulu) తిడుతూ దాడికి పాల్పడ్డారు. తనపై దాడి జరిగిన అనంతరం ఆ వివరాలు మీడియాకు వెల్లడించిన తీన్మార్ మల్లన్న.. కత్తితో దుండగులు జరిపిన దాడిలో తన చేతికి గాయమైందని (Teenmar Mallanna injured in attack) అన్నారు.
Minister KTR responds to Lyricisit Kandikonda Daughters appeal: సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక చేసిన ఓ విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కందికొండ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
KTR writes letter to centre: సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ (Mega Powerloom Cluster) ఏర్పాటుకై గతంలో ఏడుసార్లు కేంద్రానికి లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని గుర్తుచేశారు. రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.