Minister KTR: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్.. రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు

Minister KTR Review Meeting: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 07:44 PM IST
  • ఉమ్మడి నల్గొండ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
  • మునుగోడుకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం..
  • తిరుమల స్థాయిలో యాదాద్రికి భక్తులు
Minister KTR: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్.. రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు

Minister KTR Review Meeting: నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని.. గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లా ప్రజలకు టీఆర్ఎస్‌కు పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడును‌ గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెళ్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రజలు ఇంతలా ఆశీర్వదించినందుకే కేసీఆర్ ఆదేశానుసారం ఇక్కడకి వచ్చామని చెప్పారు. మునుగోడు అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు.  

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు గెలిపించింది కూసుకుంట్లను కాదని.. మా అందరినీ అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేదని.. కేసీఆర్ వచ్చాక నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి క్లాసులు కూడా ప్రారంభించామని తెలిపారు. దామరచర్ల లో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కారణంగా రాబోయే వందేళ్ల వరకు విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. అక్కడే సోలర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పారు.

'తెలంగాణలో అత్యధికంగా వరి పండించేది నల్లగొండ జిల్లా. జిల్లాలో సాగు విస్తీర్ణం కేవలం కేసీఆర్ ప్రోత్సాహం కారణంగానే పెరిగింది. తిరుమల స్థాయిలో యాదాద్రి కి భక్తులు తరలివస్తున్నారు. దండు మల్కాపురంలో 540 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించి పారిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు టీఆర్ఎస్‌ను ఏ విధంగా గుండెళ్లో పెట్టుకుని 12 నియోజకవర్గాల్లో గెలిపించారో మిమ్మల్ని అలానే గుండెళ్లో పెట్టుకుంటాం..' అని మంత్రి కేటీఆర్ తెలిపారు.  

రాబోయే ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో ఈరోజు సమీక్ష నిర్వహించామని తెలిపారు. రూ.402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతామని.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని అన్నారు. మునుగోడులో వంద కోట్లతో రహదారుల విస్తరణ చేస్తామని హామీ ఇచ్చారు. చండూరు మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ.50 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 

Also Read: Iyan Griggs: వామ్మో.. టాటూలకే రూ.29 లక్షలు ఖర్చు చేసిన ఘనుడు..!  

Also Read: 32 Inches Smart TV: స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్.. రూ.7 వేలకు లోపే 32 ఇంచుల టీవీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News