టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను తయారు చేయనుందని ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
శనివారం అక్టోబర్ 14 న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా తన బంగారు ఫోన్ పోగొట్టుకున్నట్టు పోస్ట్ చేసింది.
Earthquakel latest: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ఇటీవల ఇండియాలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కార్ల వాడకంలో మార్పులు వస్తున్నాయి. ఎక్కువగా హైబ్రిడ్ మరియు ఎలాక్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ హైబ్రిడ్ కార్స్ ఇవ్వే!
డెంగ్యూ జ్వరం కారణంగా శుభమన్ గిల్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి దూరమయ్యాడు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూఢిల్లీలోని జరిగే మ్యాచ్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ANI నివేదికలు వెల్లడించాయి.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో చారిత్రాత్మక చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి సారి 100 పథకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టులోని ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ సోకింది. ఆ వివరాలు..
వరల్డ్ కప్ 2023 అంటేనే ఒక పండగ.. ఫ్యాన్స్, కేరింతలు, హంగామా.. ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్ స్టేడియం పూర్తిగా బోసిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో అభిమానులు కరువయ్యారు.
ఎక్కడైనా చిన్న చిన్న దొంగతనాలు, చోరీలు చూసి ఉంటారు.. కానీ ఏకంగా బస్సు స్టాప్ చోరీ అయిన ఘటన ఎక్కడైన చూసారా..? అవును అసెంబ్లీకి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న బస్సు షెల్టర్ చోరీకి గురైంది. ఆ వివరాలు..
వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ మరి కొన్ని గంటల్లో మన దేశంలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 గురువారం రోజున అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్ - న్యూజీలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇపుడు ఇదే క్రికెటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. వరల్డ్ కప్ ప్రారంభానికి, ఆటగాళ్లకు తలనొప్పికి ఏంటి అని అనుకుంటున్నారా..?
ఎలక్టికల్ కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఒకసారి సీల్ (BYD Seal EV) ను పరీక్షించండి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 650 కిలోమీటర్లు వరకు తిరోగొచ్చంట. థాయ్‌లాండ్ లో లాంఛ్ అయిన ఈ కారు ఇండియాలో కూడా రానుంది.
ప్రముఖ మోటారు తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా.. మరో కొత్త యాక్టివా మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు ఉన్న ఈ స్కూటీ ధర.. రూ.80,734 గా ఉంది. ఆ వివరాలు..
ఈ మధ్యకాలంలో చాలా మంది ఆన్లైన్ స్కామ్‌లకు గురవుతున్నారు. వీటి గురించి అవగాహాన లేని వారిని టార్గెట్ చేస్తూ.. సామాన్యులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఈ దారుణాలు వాట్సప్ లో ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. ఆ వివరాలు..
IND VS AUS, 3rd ODI Match Highlights: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కానీ సిరీస్ మాత్రం 2-1 తేడాతో భారత్ వశమైంది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Vivo T2 Pro 5G సరికొత్త మొబైల్ విడుదల చేయనుంది. 3D కర్వ్డ్ డిస్ప్లే తో రెండు రకాల రంగులలో వస్తున్న ఈ ఫోన్ అత్యంత వేగంగా పనిచేసే మొబైల్ గా పేర్కొంది. ధర మరియు ఇతర వివరాలు..
ఖలీస్థానీ ఉగ్రవాది హతమార్చడంపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా భారతదేశంలోని దౌత్య కార్యలయాల్లో కెనడా ఉద్యోగస్తులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీని వలన ఇరు దేశాల మధ్య రాకపోకలపై ప్రభావం పడనుంది.
మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలనీ, దీని పైన కాలయాపన చేస్తే కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.