Vivo T2 Pro 5G Price: వివో 5G స్మార్ట్ ఫోన్ లాంఛింగ్.. ధర ఎంతో తెలుసా..?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Vivo T2 Pro 5G సరికొత్త మొబైల్ విడుదల చేయనుంది. 3D కర్వ్డ్ డిస్‌ప్లే తో రెండు రకాల రంగులలో వస్తున్న ఈ ఫోన్ అత్యంత వేగంగా పనిచేసే మొబైల్ గా పేర్కొంది. ధర మరియు ఇతర వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 07:35 PM IST
Vivo T2 Pro 5G Price: వివో 5G స్మార్ట్ ఫోన్ లాంఛింగ్.. ధర ఎంతో తెలుసా..?

Vivo T2 Pro 5G Price: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో (Vivo) మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.  Vivo T2 Pro 5G మొబైల్ MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది అత్యంత వేగంగా పనిచేసే మొబైల్ గా పేర్కొంది. 3D కర్వ్డ్ డిస్‌ప్లే తో రెండు రకాల రంగులలో వస్తుంది. భారత విపణిలోకి వచ్చిన ఈ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ధరతో పాటు మరిన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Vivo T2 Pro 5G ధర: 
Vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్.. 8 GB RAM, 128 GB స్టోరేజ్‌తో ఉన్న బేస్ మోడల్ రూ. 23,499 నుంచి విక్రయిస్తున్నారు. అదే విధంగా 256 GB స్టోరేజ్ కలిగిన Vivo T2 Pro 5G వేరియంట్ ధర రూ. 24,999 గా ఉంది. దీని మొదటి సేల్ సెప్టెంబరు 29న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్టు ఈ లాంఛ్ చేయనుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ లాంఛింగ్ ఆఫర్ లలో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 2 వేలు తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతో పాటు రూ. 1000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ను కలిగి ఉంది. ఇందులో నో కాస్ట్ EMI ఎంపిక ఉండడం గమనార్హం. 

Vivo T2 Pro 5G డిజైన్ పరంగా గ్లాస్ బ్యాక్, కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది న్యూ మూన్ బ్లాక్, డ్యూన్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫోన్ ధరల విభాగంలో సన్నని రూపంలో ఉంటుందని వివో సంస్థ స్పష్టం చేసింది.

Also Read: Monthly Income Scheme: సరికొత్త స్కీమ్.. నెలనెలా ఆదాయం గ్యారెంటీ!

వివో T2 Pro 5G స్పెసిఫికేషన్స్: 

1) డిస్‌ప్లే: Vivo T2 Pro 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే.. 1300 nits పీక్ బ్రైట్‌నెస్‌

2) ప్రాసెసర్: ఈ స్మార్ట్ ఫోన్ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌

3) RAM, స్టోరేజ్: Vivo T2 Pro 5G 8GB + 128GB, 8GB + 256GB రెండు వేరియంట్‌లలో వస్తుంది.

4) కెమెరాలు: 64MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె లెన్స్‌, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా. 

5) సాఫ్ట్‌వేర్: Funtouch OS 13

6) బ్యాటరీ, ఛార్జింగ్: 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Also Read: Low Glycemic Index Fruits: గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ గల పండ్లు.. టైప్ -2 డయాబెటిస్ చాలా హెల్తీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News