Uttarakhand earthquake: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం.. ఆందోళనలో జనం..

Earthquakel latest: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 12:44 PM IST
Uttarakhand earthquake: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం.. ఆందోళనలో జనం..

Earthquake in Uttarakhand: నార్త్ ఇండియన్ స్టేట్స్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా హీమాలయన్ రాష్ట్రం ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 16న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉదయం 09:11 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.  పితోర్‌గఢ్‌కు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

ఈ నెల ప్రారంభంలో అంటే అక్టోబర్ 5న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3:49 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. అంతేకాకుండా భూకంప కేంద్రం 5కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. ఇటీవలే నేపాల్‌లో 6.2 తీవ్రత‌తో భారీ భూకంపం సంభవించింది. దాని ప్రకంపనలకు ఉత్తరభారతం వణికింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇక మన పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో అక్టోబరు 15న 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఎర్త్ క్విక్ వల్ల ఒక వ్యక్తి మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. ఉపరితలం నుంచి దాదాపు 8 కిలోమీటర్ల లోతుల్లో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దేశంలోనే అక్టోబరు 07న ఏర్పడిన భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుది. 2వేల మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలాయి.  

Also Read: Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో మరో భారీ భూకంపం.. ఈ నెలలో మూడోది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News