మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలనీ, దీని పైన కాలయాపన చేస్తే కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2023, 07:37 PM IST
  • మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి
  • ఓబిసి మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • కవితకు శుభాకాంక్షల వెల్లువ
  • మహిళా బిల్లు కోసం కృషి చేసినందుకు అభినందనలు
మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Women's Reservation Bill 2023: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని హెచ్చరించారు. ఒకవేళ రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తే  కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

తెలంగాణ ఏర్పడిన 12వ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందని అన్నారు. తమ ప్రభుత్వము తీర్మానం చేసిన దాదాపు పది సంవత్సరాల తర్వాత కేంద్రం బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు.  మరింత కాలయాపన చేయకుండా తక్షణమే రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మహిళా రిజర్వేషన్లలో సామాజిక న్యాయం కూడా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన ప్రతిపాదన తరహాలో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. దాంతో అన్ని వర్గాల మహిళలకు రిజర్వేషన్ల ఫలాలు  అందుతాయని అభిప్రాయపడ్డారు.

Also Read: Realme C53 Price: రూ.14 వేల స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.649 ధరకే కొనేయండి!

కవితకు శుభాకాంక్షలు వెల్లువ
మహిళా బిల్లు కోసం విశేషంగా కృషి చేసిన కల్వకుంట్ల కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కవితను బుధవారం రోజున రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు పలువురు నాయకులు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. పట్టణంలోని ఆయా కాలేజీల విద్యార్థినులు కూడా కవితను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు

Also Read: Citroen C3 Sales: భారత విపణిలో మరో కొత్త SUV కారు..అతి చౌక ధరతో ప్రీ-ఆర్డర్ సేల్స్ షురూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News