Bus Shelter Theft: బెంగుళూలో బస్సు స్టాప్ చోరీ.. అది కూడా అసెంబ్లీలో కిలో మీటర్ దూరంలో

ఎక్కడైనా చిన్న చిన్న దొంగతనాలు, చోరీలు చూసి ఉంటారు.. కానీ ఏకంగా బస్సు స్టాప్ చోరీ అయిన ఘటన ఎక్కడైన చూసారా..? అవును అసెంబ్లీకి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న బస్సు షెల్టర్ చోరీకి గురైంది. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 01:41 PM IST
Bus Shelter Theft: బెంగుళూలో బస్సు స్టాప్ చోరీ.. అది కూడా అసెంబ్లీలో కిలో మీటర్ దూరంలో

Bus Shelter Theft in Bangalore: సాధారణంగా.. గోల్డ్ చెయిన్, వాహనాలు లేదా బ్యాగులు లాంటివి దొంగతనం గురవ్వటం మనకు తెలిసిందే! లేదా బ్యాంకు దోపిడీ లాంటివి విని ఉంటాం. కానీ ఏకంగా బస్ స్టాప్ నే దొంగతనం చేయటం విన్నారా..? అవును నిజంగానే రూ. 10 లక్షల విలువైన బస్ స్టాప్ దొంగతనం చేశారు. 

వివరాల్లోకి వెళ్తే..  కర్ణాటక రాజధాని.. బెంగుళూరు నగరంలో బీఎంటీసీ ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ చోరీకి గురైంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది అసెంబ్లీకి ఒక కిలో మీటర్ దూరంలోనే ఉంటడం. స్టెయిన్ లెస్ స్టీల్ తో చేసిన ఈ షెల్టర్ నిర్మాణానికి రూ. 10 లక్షల వరకు  ఖర్చు అయిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీగా ఉండే కన్నింగ్ హోమ్ లో వారం రోజుల కిందే ఈ షెల్టర్ ఏర్పాటు చేశారని.. అంతలోనే చోరీకి గురైందని షెల్టర్ ఏర్పాటు పనులు అప్పగించిన సంస్థ ఫిర్యాదు చేసింది. 

బెంగుళూరు నగరంలో బస్సు షెల్టర్ లను నిర్మించటానికి అక్కడి ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. ఆ కంపెనీ అధికారి N.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. బస్సు షెల్టర్ దొంగతనంపై 30 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాము,  దొంగతనానికి గురైన బస్సు షెల్టర్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసింది మరియు అది చాలా బలమైంది. ఈ షెల్టర్ ఆగస్టు 21 ఏర్పాటు చేశామని.. 28న ఆగస్టు బస్సు షెల్టర్ చూడటానికి వెళ్తే.. అక్కడ ఏమిలేదని.. అందుకోసమే పోలీసులకు ఫిర్యాదు చేసాము. ఐపీసీ సెక్షన్ 279 (దొంగతనం) కింద పోలీసులు కేసు నమోదు చేశారని" తెలిపారు. 

Also Read: Eng Vs NZ Match Upadates: నేడే విశ్వకప్ ఆరంభం.. తొలి మ్యాచ్‌కు ముందు రెండు జట్లకు షాక్  

యలహంక, హేబల్, గంగేనహళ్లి, పులకేశినగర్, లింగరాజపురం, బాణసవాడి, హెన్నూరు వెళ్లే ప్రయాణికులను షెల్టర్ ఇచ్చెదని.. ఇది వరకు ఒక చిన్న శిథిలావస్థకు చేరిన బస్సు స్టాప్ ఉండేదని ప్రయాణికుడు తెలిపారు.వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన బస్సు షెల్టర్ వలన ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా ఉంటానికి కొత్త బస్సు స్టాప్ ను ఏర్పాటు చేసారాని వాపోయారు.   

Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు, ఎవరితో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News