One Nation One Election Bill: కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లు తెచ్చేసింది. ఇవాళ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రెండు సభల్లో ఆమోదం పొందితే ఇక చట్టరూపం దాల్చినట్టే. జమిలి ఎన్నికల బిల్లు ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం.
దేశంలో ఇప్పుడు అంతా జమిలి ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తరువాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే పక్ష పార్టీలు ఆమోదించినా. ఇండీ కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. పార్లమెంట్ రెండు సభల్లోనూ ఆమోదం పొంది సగం రాష్ట్రాలు ఆమోదిస్తే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. అన్ని అనుకున్నట్టు సవ్యంగా జరిగితే 2027 ఫిబ్రవరిలో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. జమిలి ఎన్నికలంటే దేశంలో లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి కలిసి జరుగుతాయి.
ఏదైనా ప్రభుత్వం పడిపోతే
లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఏదైనా రాష్ట్రంలో ఏవైనా కారణాలతో ప్రభుత్వం పడిపోతే యధావిధిగా ఆరు నెలల్లోగా ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా పూర్తిగా ఐదేళ్ల కోసం జరగవు. ప్రభుత్వం పడిపోయేనాటికి ఎంతకాలం మిగిలిందో అంతే కాలానికి ఎన్నికలు జరుగుతాయి. అంటే ఉదాహరణకు ఎన్నికలు జరిగిన రెండేళ్లకు ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే తిరిగి ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మిగినిన మూడేళ్ల కాలానికే పవర్‌లో ఉంటుంది.
ఏదైనా అసెంబ్లీ ఎన్నికల్ని ఒకవేళ లోక్‌సభతో పాటు నిర్వహించలేకపోతే రాష్ట్రపతి ఆదేశాలతో తిరిగి ఎన్నికలు జరిపించేలా ఈ బిల్లులో ఉంది. 129వ రాజ్యాంగ సవరణ సెక్షన్ 2 క్లాజ్ 5 ప్రకారం ఇది వీలవుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
Also read: Salary DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కళ్లు చెదిరే గుడ్‌న్యూస్, భారీగా పెరగనున్న జీతం, డీఏ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.