Whatsapp Scams India: మీ మొబైల్ హ్యాక్ అయ్యిందా? అయితే ఇప్పుడే తెలుసుకోండి!!

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆన్‌లైన్ స్కామ్‌లకు గురవుతున్నారు. వీటి గురించి అవగాహాన లేని వారిని టార్గెట్ చేస్తూ.. సామాన్యులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఈ దారుణాలు వాట్సప్ లో ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. ఆ వివరాలు..   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 04:03 PM IST
Whatsapp Scams India: మీ మొబైల్ హ్యాక్ అయ్యిందా? అయితే ఇప్పుడే తెలుసుకోండి!!

Whatsapp Scams India: భారతదేశంలో ఆన్‌లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరిపోయాయి. ఇంటర్నెట్ పై పెద్దగా అవగాహన లేని వారిపై సైబర్ నేరగాళ్లు ఫోకస్ చేస్తున్నారు. అలాంటి కేటుగాళ్లు వేసిన ఎరకు ఎంతోమంది చిక్కుకొని తమ డబ్బును పొగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా వాట్సాప్ వినియోగించే వారిని టార్గెట్ చేసుకొని ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. యూజర్స్ ను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు నిత్యం ఏదో కొత్త పన్నాగం పన్నుతున్నారు. ఇటీవలీ రోజుల్లో స్కామ్ చేసే వ్యక్తులు వివిధ నంబర్ల నుంచి WhatsApp కాల్స్ చేస్తున్నారు. దీని ద్వారా వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను బహిర్గతం చేస్తున్నారు. ఈ విధంగా దేశంలో రోజూ ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి ఆన్‌లైన్ స్కామ్ ల పట్ల జాగ్రత్తగా ఉండడానికి ముందు వాటిపై అవగాహన పెంచుకోవడం మేలు. దీని ద్వారా మన వ్యక్తిగత గోప్యత భద్రంగా ఉంటుంది. అయితే ఆన్‌లైన్ స్కామ్ కనుగొనేందుకు 5 రకాల మార్గాలు ఉన్నాయి. 

స్కామ్ అంటే ఏమిటి?
అసలు స్కామ్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. స్కామ్ అంటే సంబంధిత వ్యక్తులను వారి వ్యక్తిగత లేదా ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని బహిర్గతం చేయడం.. అలా చేసి వారి మోసగించి డబ్బు గుంజుకోవడం వంటివి స్కామ్ ల ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా స్కామ్ జరిగేందుకు అవకాశం ఉంది. అయితే అమాయకపు వినియోగదారులను సైబర్ కేటుగాళ్లు లక్ష్యంగా మార్చుకునేందుకు అవకాశం ఎక్కువ. పూర్తిగా తెలియని వాటిపై క్లిక్ చేయకుండా ఉండడమే మంచి పని. అలాంటి తెలియని వాటి గురించి ఇప్పుడు తెలియచేయడం మా లక్ష్యం. 

స్కామ్స్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి?
WhatsApp స్కామ్‌ జరిగిందని గుర్తించడానికి కింద పేర్కొన్న చిట్కాలను అనుసరించండి. 

అపరిచిత కాల్స్ పట్ల జాగ్రత్త..
వాట్సాప్‌లో తెలియని నంబర్‌ల నుంచి కాల్ లిఫ్ట్ చేసేప్పుడు వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

కాల్ చేసే వారిని ముందు ధృవీకరించుకోండి..
ఏదైనా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు కాల్ చేసిన వ్యక్తి గురించి వివరాలతో పాటు వారిని గుర్తింపును ఎల్లప్పుడూ ధృవీకరించండి.

Also Read: Flipkart Big Billion Days Sale 2023: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు

అత్యవసరంగా డబ్బు అడిగితే.. 
సైబర్ కేటుగాళ్లు మన వ్యక్తిగత వివరాలను తస్కరించేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా అత్యవసరం అని మాటల్లో పెట్టి త్వరగా సమాచారాన్ని అందించండి అని మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. అలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండి.. తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి.

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకండి
వాట్సాప్ లో తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింక్స్ పై క్లిక్ చేయడం మంచి పని కాదు. ఎందుకంటే అవి మోసపూరిత వెబ్‌సైట్‌లకు దారితీసి.. మీ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. 

2FA భద్రత
WhatsAppలో 2FAని యాక్టివేట్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్ కు అదనపు భద్రతను జోడించినట్లు అవుతుంది. దీంతో స్కామర్‌లు మీ ఖాతాను యాక్సెస్ చేయడం కష్టతరం చేస్తుంది.

WhatsApp మోసపోతే మీరు ఏం చేయాలి?

వాట్సాప్ లో మీరు స్కామ్ బారిన పడినట్లు గుర్తిస్తే మీరు వెంటనే మాట్లాడడం ఆపేయాలి. మెసేజ్ లకు రిప్లే కూడా ఇవ్వకండి. ఆన్ లైన్ లో డబ్బు ట్రాన్సఫర్ చేయడం పూర్తిగా ఆపేయండి. 

నంబర్‌ను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి
స్కామ్ బారిన పడకుండా అనుమానాస్పద నంబర్లను ముందుగా బ్లాక్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్ కు రిపోర్ట్ రూపంలో తెలియజేయండి.

Also Read: ICC World Cup 2023: ఈసారి ప్రపంచకప్‌లో మూడు కొత్త నిబంధనలతో సిద్ధమైన ఐసీసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News