IND vs WI 2nd ODI Playing XI: అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేకు దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు.
India vs West Indies: వెస్టిండిస్, ఇండియా వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో 22 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
IND vs WI T20I Series: కరోనా అధికంగా ఉన్న ఈ సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని, ప్రేక్షకులను ఎట్టిపరిస్థితుల్లో మైదానాల్లోకి అనుమతించం అని సౌరవ్ గంగూలీ చెప్పారు.
Dhawan, Shreyas and Ruturaj Gaikwad test positive for Covid 19: వెస్టిండీస్‌తో జరగనున్న పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ మరియు శ్రేయాస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
IND vs WI ODI Series 2022: టీమ్ఇండియా, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లకు ప్రేక్షకులకు అనుమతించబోమని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేసింది.
దేశంలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. వెస్టిండీస్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరోసారి స్పందించాడు. జట్టుకి లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లానే ఆలోచిస్తానని కోహ్లీ చెప్పాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లీ ముందుగా టీ20 కెప్టెన్సీని వదిలేయగా.. ఆపై బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి తప్పించింది. అనంతరం విరాట్ స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేశాడు.
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు తమిళనాడు స్టార్ ఆటగాళ్లు షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లను బ్యాకప్‌గా బీసీసీఐ భారత జట్టులోకి తీసుకుంది. అయితే వీరిద్దరు ప్రస్తుతం ప్రధాన జట్టులో భాగం కాలేరు.
ఇప్పటికే టీమిండియాతో వన్డేల కోసం జట్టును ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. శనివారం టీ20ల కోసం 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. విండీస్ జట్టుకు సీనియర్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు.
Rohit Sharma: గాయంతో దక్షిణాఫ్రికా టూర్ మిస్సయిన రోహిత్ శర్మ ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా రోహిత్ ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Rohit Sharma Captaincy: ఇండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానం కోసం రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. అనేక గాయాల కారణంగా సౌతాఫ్రికా సిరీస్ డుమ్మా కొట్టిన రోహిత్ శర్మ.. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరగనున్న సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది.
వెస్ట్ ఇండీస్‌తో జరగనున్న 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా ఈ టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ సైతం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, టీ20ఇంటర్నేషనల్స్‌లో ఛాంపియన్‌గా దూసుకుపోతున్న వెస్ట్ ఇండీస్ని ఓడించి సిరీస్ సొంతం చేసుకోవడం అనేది జట్టుకు పెద్ద సవాలుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు క్రికెట్ నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.