Virat Kohli Captaincy: లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు! కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరోసారి స్పందించాడు. జట్టుకి లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లానే ఆలోచిస్తానని కోహ్లీ చెప్పాడు.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లీ ముందుగా టీ20 కెప్టెన్సీని వదిలేయగా.. ఆపై బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి తప్పించింది. అనంతరం విరాట్ స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 07:57 PM IST
  • లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు
  • విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేసిన కెప్టెన్
Virat Kohli Captaincy: లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు! కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Virat Kohli about Team India Captaincy: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరోసారి స్పందించాడు. జట్టుకి లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లానే ఆలోచిస్తానని కోహ్లీ చెప్పాడు.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లీ ముందుగా టీ20 కెప్టెన్సీని వదిలేయగా.. ఆపై బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి తప్పించింది. అనంతరం విరాట్ స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేశాడు. 

తాజాగా 'Firseside Chat with VK'లో మాట్లాడుతూ... 'ప్రతిదానికీ ఓ పదవీకాలం మరియు సమయ వ్యవధి ఉంటుంది. మీరు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి. ఈ వ్యక్తి ఏమి చేసాడు అని ప్రజలు అనుకోవచ్చు. కానీ మీరు మరింత సాధించాలని ఆలోచించినప్పుడు ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓ బ్యాటర్‌గా జట్టుకు మరిన్ని విజయాలు అందించే అవకాశం దక్కింది.  నేను గర్వపడుతున్నా. నాయకుడిగా ఉండటానికి కెప్టెన్‌గా ఉండవలసిన అవసరం లేదు. గతంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాను. ఆ తర్వాత కెప్టెన్‌గా పని చేశా. అప్పుడూ, ఇప్పుడూ నా మైండ్‌సెట్ ఓకేలా ఉంది. జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. నేనెప్పుడూ కెప్టెన్‌ లానే ఆలోచిస్తా' అని అన్నాడు. 

'గెలుపోటములు మన చేతుల్లో ఉండవు. కానీ జట్టు కోసం అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాలి. భారత జట్టు సంస్కృతిని మార్చడం చాలా కష్టం. నేను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించా. అగ్ర స్థానంలో నిలిపేందుకు కృషి చేశా. ఎవరికైనా వారి లక్ష్యాలపై పూర్తి అవగాహన ఉండాలి. జట్టులో నా పాత్రేంటో నాకు తెలుసు. వేరే వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు ఆటగాళ్లతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. భారత జట్టులో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదువలేదు. నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి వారిని మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దాలి' అని కోహ్లీ చెప్పాడు. 

Also Read: IPL 2022 Auction: 'తప్పలేదు మరి.. శుభ్‌మన్ గిల్‌ను కోల్పోవడం బాధగా ఉంది'

Also Read: Acharya New Release Date: మెగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఆచార్య అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News